Tan Removing Traditional Tips: ముఖంపై ట్యాన్ తొలగించడానికి అమ్మమ్మల కాలం నాటి 5 చిట్కాలు..
Tan Removing Traditional Tips: ఆరెంజ్ తొక్కలో విటమిన్ సి ఆంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని మెరిపించే గుణం కలిగి ఉంటుంది ఆరెంజ్ తొక్కలను ఎండపెట్టి గ్రైండ్ చేసి పొడి చేసుకొని పెట్టుకోవాలి.
Tan Removing Traditional Tips: ఎండ వల్ల ముఖం ట్యాన్ అయిపోతుంది. దీంతో ముఖం నల్లగా జీవం లేనట్టుగా మారిపోతుంది. దీనికి ఎన్నో స్కిన్ కేర్ వస్తువులు ఉన్నాయి. కానీ అవి సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్నవి వేల ఖర్చుతో కూడుకున్నవి. అయితే ఇంట్లోనే కొన్ని వస్తువులతో ముఖాన్ని మెరిపించవచ్చు. పసుపు శనగపిండి గంధంతో ముఖ పై ఉన్న ఫ్యాన్ ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం.
పసుపు, శనగపిండి..
పసుపు శనగపిండిలో యాంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు ఉంటాయి. ఇందులో స్కిన్ ని కాంతివంతం చేసే గుణాలు ఉంటాయి. చర్మాని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి కావలసిన అంత నీళ్ళు పోసుకొని తయారు చేసుకోవాలి. దీని ముఖానికి అప్లై చేసి ఓ 20 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకుంటూ స్క్రబ్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: కొబ్బరిపాలతో పొడవాటి, మందపాటి జుట్టు.. ఇలా వాడితే మ్యాజిక్ చూస్తారు..
గంధం, రోజ్ వాటర్..
గంధంలో నయం చేసే గుణాలు ఉంటాయి. ఇందులోని కూలింగ్ గుణాలతో ఎఫెక్టివ్ గా పని చేస్తుంది ఇందులో రోజు వాటర్ వేసి కలుపుకొని పేస్టు తయారు చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల గంధంలో రోజు వాటర్ వేసి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చాలా నీటితో ఫేస్ వాష్ చేయాలి.
ఆరెంజ్ తొక్క..
ఆరెంజ్ తొక్కలో విటమిన్ సి ఆంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని మెరిపించే గుణం కలిగి ఉంటుంది ఆరెంజ్ తొక్కలను ఎండపెట్టి గ్రైండ్ చేసి పొడి చేసుకొని పెట్టుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ ఆరెంజ్ తొక్క పొడిని ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి ముఖం ట్యాన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.
వేప, ముల్తానీ మిట్టి..
ముల్తాని పెట్టి ముఖంపై ఉన్న అదనపు నూనెను గ్రహిస్తుంది. ఇక వేప స్కిన్ పై అలెర్జీ రాకుండా పోరాడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి, ఒక టేబుల్ స్పూన్ వేపపొడి వేసి పేస్ట్ మాదిరి తయారు చేసుకొని ముఖమంతా అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.
ఇదీ చదవండి: టమాటా ముఖానికి ఇలా వాడితే కాంతివంతమైన చర్మం మీ సొంతం..
నువ్వుల నూనె, పసుపు..
నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. చర్మానికి సాగే గుణాన్ని అందించి కాంతివంతం చేస్తాయి. పసుపులో ముఖాన్ని కాంతివంతం చేసి ఈవెన్ స్కిన్ టోన్ అందిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనెలో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి ముఖమంతా మసాజ్ చేయాలి 20 నిమిషాల తర్వాత నూనె చర్మం లోకి గ్రహిస్తుంది గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగితే మెరిసే ముఖం మీ సొంతం అవుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి