Charminar: లాడ్ బజార్ గాజుల చరిత్ర.. చార్మినార్ దగ్గరికి వెళితే ఇది తప్పనిసరి..
Bangles: గాజులు అంటే ఇష్టపడని అమ్మాయిలు ఎవరుంటారు. అందులో చార్మినార్ పేరు వినగానే అమ్మాయిలకి గుర్తొచ్చే మొదటి షాపింగ్ గాజుల షాపింగ్. కాగా ఇక్కడ దొరికే లాడ్ బజార్ గాజులకు చాలా ప్రత్యేకత ఉంది. మరి అదేమిటో ఒకసారి చూసేద్దాం పదండి
Charminar bangles: చార్మినార్.. చాలామందికి ఇది ఒక చారిత్రక కట్టడం గా మాత్రమే తెలుసు .కానీ షాపింగ్ అవుట్ స్థానికులకు ఇది ఒక పెద్ద షాపింగ్ మార్కెట్ గా పరిచయం. చార్మినార్ లాడ్ బజార్ గాజులు అంటే విపరీతమైన క్రేజ్ ఉంది.ఒకప్పుడు హైదరాబాదు ను భాగ్యనగరం అని పిలిచేవాళ్ళ. ఇక్కడ ముత్యాలకు ఎటువంటి కొదవలేదు.. అనాదిగా ముత్యాల నగరంగా పేరుగాంచిన హైదరాబాదులో వారసత్వంగా కొన్ని కలలు మిగిలిపోయాయి. అలా ఇప్పటికీ ఎప్పటికీ చార్మినార్ పై చెరిగిపోని ముద్ర వేసినవే లాడ్ బజార్ గాజులు.
హైదరాబాద్ కి గుండెకాయ లాంటి చార్మినార్ చుట్టూ ఉన్న మార్కెట్లు ఎన్నో రకాల హస్త కళలకు ప్రతీకలుగా మిగిలిపోయాయి. సంప్రదాయ దుస్తుల దగ్గర నుంచి అత్తరు వరకు.. ఫ్యాషన్ ఐటమ్స్ దగ్గర నుంచి గాజుల వరకు ఇక్కడ దొరకంది ఉండదు. పండుగ రోజుల్లో అయితే ఈ మార్కెట్ అర్ధరాత్రి వరకు కలకలలాడుతూ ఉంటుంది. నిత్యం సందడిగా ఉండే చార్మినార్ మార్కెట్ మధ్యలో ఉండేదే లాడ్ బజార్.ఇందులో కళ్ళు చెదిరిపోయే రకరకాల డిజైన్స్ తో కూడిన రంగు రంగుల గాజులు లభిస్తాయి.
డిజైనర్ వేర్ గాజుల సైతం 20 రూపాయల నుంచే మొదలవుతాయి. హైదరాబాద్ ఘన వారసత్వానికి ఆనవాలుగా మిగిలినవే ఈ లాడ్ బజార్ గాజులు అనడంలో డౌటే లేదు. సంప్రదాయ బద్ధమైన డిజైన్స్ తో పాటు మోడ్రన్ ఫ్యాషన్ ని సైతం మేలవించుకొని అద్భుతమైన డిజైన్స్ తో వీటిని ఆవిష్కరిస్తారు అక్కడి కళాకారులు. ఇక్కడ లభించే గాజులలో ప్రధానంగా లోహం లక్క గాజుతో చేసినవి ఉంటాయి. ఇక్కడ లభించే రంగురంగుల గాజులకు దేశవ్యాప్తంగానే కాక.. విదేశాలలో కూడా ఫాన్స్ ఉన్నారు.
ఈ మార్కెట్లో అందరి బడ్జెట్ కి అనుకూలంగా గాజులు దొరకడం మరొక విశేషం. 20 రూపాయల నుంచి మొదలయ్యే గాజుల ధర 500 వరకు ఉంటుంది. పెళ్లయినా ..పేరంటమైనా ..ఫంక్షన్ అయినా.. శ్రీమంతమైనా.. ప్రతి అకేషన్ కి ఇక్కడ గాజులు దొరుకుతాయి. మనలో చాలామందికి డ్రెస్ కి తగినట్టుగా గాజులు సెట్ చేసుకోవాలి అంటే కొన్నిసార్లు అర్థం కాదు. అలాంటప్పుడు మీ శారీ తీసుకొని వెళ్తే మ్యాచింగ్ అయ్యేలా మంచిగా సెట్ చేసి మరి బ్యాంగిల్స్ ని మీకు ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook