Gases Immediately After Eating: ఆధునిక జీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఎసిడిటీ, మలబద్దం వంటి సమస్యల బారిన పడుతున్నారు. మనలో చాలా మంది తిన్నవెంటనే గ్యాస్‌ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలకు ఇంట్లో లభించే కొన్ని ఆహార పదార్థాల వల్ల పరిష్కారం లభిస్తుంది. 
  
సోంపు:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు ఆహారం తిన్న తర్వాత సోంపు తీసుకుంటున్నారా. సోంపు తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యలు దూరం అవుతాయి.సోంపు నేరుగా తీసుకోవచ్చు. లేదా టీ తయారు చేసుకొని తాగవచ్చు. దీని గోరువచ్చని నీటిలో మరిగించి కూడా పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 


గోరువెచ్చని:


గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల కూడా ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. ఇందులో నల్ల మిరియాలు కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. లేదంటే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ వేసి ఉంచడం వల్ల గ్యాస్ సమస్య దూరం అవుతుంది. 
 
జీలకర్రనీరు:  


జీలకర్రలో అనేక ఆరోగ్య ఔషధ గుణాలు ఉన్నాయి. జీలకర్ర యాసిడ్‌ రిప్లెక్స్‌ గ్యాస్‌ను దూరం చేయడంలో సహాయపడుతుంది. గ్యాస్‌ సమస్య ఉన్నప్పుడు జీలకర్రను ఉపయోగించడం చాలా మంది.


గ్రీన్ టీ తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది జీర్ణవ్యవస్థలో ఆక్సీకరణ భారాన్ని సమతుల్యం చేయడానికి యాంటీఆక్సిడెంట్‌గా చేస్తుంది. దీని వల్ల గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.


పెరుగు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.పెరుగుతో పాటు వేయించిన జీలకర్ర తీసుకుంటే  జీర్ణక్రియ  మెరుగుపడుతుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఎసిడిటీని తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది.


జంక్‌ ఫూడ్‌, మసాలా వంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా గ్యాస్‌ సమస్య బారిన పడాల్సి ఉంటుంది. దీని కన్నా ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు. భోజనం చేసిన తర్వాత ఓట్‌ మీల్, ఓట్స్‌ లాంటివి తీసుకుంటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 


Also Read Ramaphalam: రామఫలం తిని తినండి.. శరీరంలో జరిగే మ్యాజిక్ మీరే చూడండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter