korean drinks for weight loss: ప్రస్తుత కాలంలో మారిన ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగా తీవ్రమైన అనారోగ్యసమస్యల బారిన పడుతున్నారు. అధిక బరువు కారణంగా నచ్చిన దుస్తులు, ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అయితే సులువుగా బరువు తగ్గాలి అనే ఆలోచనతో చాలా మంది మార్కెట్‌లో లభించే కొన్ని ప్రొడెట్స్‌ను ఉపయోగిస్తున్నారు. దీని కారణంగా ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఎలాంటి ఖర్చుతో కూడిన పనులు చేయకుండా సులువు బరువు తగ్గాలి అంటే ఈ కొరియన్‌ టీలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని మనం ఇంట్లోనే తయారు చేసుకొని తీసుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గడానికి సహాయపడే కొరియన్ టీ:


గ్రీన్‌ టీ:


గ్రీన్‌ టీ గురించి తెలియని వారు ఉండరు. కొరియాలో అత్యంత ప్రజాదరణ పొందిన టీ గ్రీన్‌ టీ. దీని తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. అలాగే ఎలాంటి హానికరమైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. 


బార్లీ టీ :


కొరియన్‌లో ఎంతో ప్రసిద్ది చెందిన టీ  ఈ బార్లీ టీ. దీని రోస్ట్‌ చేసిన బార్లీ గింజలను వేడి నీటిలో మరిగిస్తారు. తర చక్కెర పానీయాలకు ప్రత్యామ్నాయంగా దీనిని తీసుకోవచ్చు.


రోజ్ టీ :


 గుల్చా టీ ని రోజ్‌ టీ అని పిలుస్తారు. దీని తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. అలాగే కుంకుమపువ్వు, గులాబీ రేకలు తీసుకోవడం వల్ల విటమిన్ సి లభిస్తుంది. రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది.


Also Read Rusk Side Effects: మీరు రస్క్‌ తీసుకుంటున్నారా? అయితే మీరు డేంజర్ లో పడినట్టే


ఒమిజా టీ :
 ఐదు రకాల రుచులతో బెర్రీ టీ అంటారు.వీటిలో తీపి, పులుపు, లవణం, చేదు, మసాలాలు అన్ని రకాల మిశ్రమంగా ఉంటాయి. మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. 


ఈ విధంగా మీరు కూడా వీటిని తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. ప్రతిరోజు దీని తీసుకోవడం వల్ల బరువుతో పాటు రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. మీరు కూడా ఈ టీలను తయారు చేసుకొని తాగి మంచి ఫలితాలను పొందవచ్చు.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter