Curry Leaves Oil For Hair Growth: ఆరోగ్యకరమైన, ఒత్తైన జుట్టు కోసం చాలా మంది మార్కెట్‌లో లభించే ప్రొడెక్ట్స్‌లను ఉపయోగిస్తుంటారు. ఈ  ప్రొడెక్ట్స్‌ను ఉపయోగించడం వల్ల జుట్టు మరింత రాలుతుంది.  జుట్టు ఆరోగ్యంగా, పొడువుగా ఉండాలి అంటే సహాజనమైన పద్దతులను ఉపయోగించడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం రోజు వంటలో ఉపయోగించే కరివేపాకు ఈ జుట్టు సమస్య నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరివేపాకుతో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లకు పుష్కలంగా లభిస్తాయి. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉండచడంలో సహాయపడుతుంది. కరివేపాకుతో హెయిర్ ఆయిల్‌ తయారు చేసుకోని ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. అయితే ఈ కరివేపాకు నూనె తయారు చేసుకోవడానికి ఒక కప్పు కరివేపాకు, ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకోవాలి. తరువాత నూనె వేడి చేసుకోవాలి. ఈ నూనెలో కరివేపాకును బాణలిలో వేయాలి పది నిమిషాల పాటు వేడి మీద నూనెలో చలబడిన తర్వాత ఆకులను కలుపుకోవాలి. నూనెను వడకట్టండి. ఇలా నూనెను తయారు చేసుకోవాలి. ఈ నూనెను  స్కాల్ప్ , హెయిర్‌కి అప్లై చేసి  మసాజ్ చేసుకోవాలి. 


ఈ విధంగా చేసిన తర్వాత నూనెను తొలగించడానికి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. దీని వల్ల    జుట్టు జిడ్డుగా ఉండకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 


జుట్టు ఆరోగ్యంగా ఉండానికి ఈ చిట్కా ఎంతో ఉపయోగపడుతంది. దీని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే జుట్టు సమస్యల త్వరగా తగ్గు ముఖం పడుతాయి. మీరు కూడా ప్రతిరోజు ఈ నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే జుట్టు రాలడం చాలా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. బయట లభించే ప్రొడెక్స్ కంటే ఈ ఇంటి చిట్కాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే దీని కోసం అధికంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఈ నూనెను ఉపయోగించడం చాలా మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also read: Liver Diseases: లివర్ వ్యాధులు మహిళల్లో ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి, నివారణ మార్గాలేంటి



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook