Cleopatra Beauty: క్లియోపాత్ర అందంగా కనిపించడానికి ఏం చేసేదో తెలుసా ? మీరూ ట్రే చేయండి
ఈజిప్టు మహరాణి క్లియోపాత్ర ( Cleopatra) అందం గురించి నేటికీ చాలా మంది మాట్లాడుకుంటారు. మన దేశంలో అందంగా ఉంటే ఐశ్వర్యరాయ్ లా ఉంది ఆ అమ్మాయి అంటారు. కానీ విదేశాల్లో క్లియోపాత్రలా ఉంది అంటారు. అంత పాపులర్ అన్నామాట.
ఈజిప్టు మహరాణి క్లియోపాత్ర ( Cleopatra) అందం గురించి నేటికీ చాలా మంది మాట్లాడుకుంటారు. మన దేశంలో అందంగా ఉంటే ఐశ్వర్యరాయ్ లా ఉంది ఆ అమ్మాయి అంటారు. కానీ విదేశాల్లో క్లియోపాత్రలా ఉంది అంటారు. అంత పాపులర్ అన్నామాట. క్లియోపాత్ర అందంగా కనిపించడానికి తీసుకున్న జాగ్రత్తలు, టిప్స్ ( Cleopatra Beauty Tips ) నేటికీ ఎంతో మంది సెలబ్రిటీలు ఫాలో అవుతుంటారు. మీరు కూడా క్లియోపాత్రలా అందంగా కనిపించాలి అనుకుంటే ఆమె ఏం చేసేదో ఒకసారి చదవండి. వీలైతే ట్రై చేయండి. ( BCCI Salary: క్రికెటర్లుకు 10 నెలల నుంచి జీతాల్లేవు )
పాలు, తేనెతో స్నానం ( Milk and Honey Bath )
క్లియోపాత్ర అందంగా కనిపించడానికి పాలు, తేనెతో ( Honey ) స్నానం చేసేది. ఈ రెండు పదార్ధాలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. చర్మాన్ని ఫ్రెష్ గా మారుస్తుంది. కావాలంటే మీరు రెండు కప్పుల పాలు, అరకప్పు తేనెతో ప్రయోగం చేయవచ్చు.
సముద్రపు లవణం, ఫేస్ స్ర్కబ్ ( Sea Salt Face Scrub )
క్లియోపాత్ర దగ్గర పనిచేసే చెలికత్తెలు తన శరీరాన్ని సముద్రపు లవణంతో తయారు అయ్యే ఉప్పుతో రబ్ చేసేవారు. దీని వల్ల శరీరంపై ఉండే మృతకణాలు తొలుగుతాయి అని... చర్మం కాంతివంతం అవుతుంది. మీరు పాల స్నానం తరువాత రెండు టేబుల్ స్పూన్ల సముద్రపు ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల థిక్ క్రీమ్ వాడి ఈ మిశ్రమంతో రబ్ చేసుకోవచ్చు. ( Short Skirts Banned: ఆ దేశంలో మహిళలు స్కర్టులు వేసుకోవడం ఇక కుదరదు )
పొడిబారిన జుట్టుకోసం...( Dry Hair )
3 చెంచాల తేనెను కాస్టర్ ఆయిల్ లో కలిపి ఈ మిశ్రమాన్ని అప్పుడే షాంపూ చేసిన జుట్టుపై ( Hair ) అప్లై చేయవచ్చు.10-12 నిమిషాల తరువాత కడిగేయాలి. పొడిబారిన జుట్టుకు ఇది ప్రాణం పోస్తుంది.
రోజ్ వాటర్... ( Rose Water )
మహారాణి తన ముఖం మరింత అందంగా కనిపించేందుకు రోజ్ వాటర్ తో ఫేషియల్ చేసేదట. రోజ్ వాటర్ చర్మాన్ని హైట్రేట్ చేస్తుంది. దీని కోసం మీరు చేయాల్సిదల్లా రోజూ రెండు పూటలు రోజ్ వాటర్ తో ముఖాన్ని తుడవడమే. (Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు )
ద్రాక్షారసంతో ( Grape Juice)
చర్మంపై పెరిగిన ట్యాన్ ను శుభ్రం చేయాడానికి కొన్ని గ్రీన్ గ్రేప్స్ ను నలిపి.. అందులో కొంచెం తేనె కలిపి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 9-12 నిమిషాల తరువాత నీటితో కడిగేయండి.