Thotakura Nutrition Facts: తోటకూరలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తహీనత వంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా రక్తంలోని సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తోటకూర తినడం వల్ల కలిగే లాభాలు:
రక్తహీనత నివారణ: 

తోటకూరలో ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రక్తాన్ని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.   


కంటి ఆరోగ్యానికి: 
తోటకూరలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా కంటి చూపును మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు గ్లాకోమా వంటి కంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.


జుట్టు పెరుగుదల: 
తోటకూరలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు దూరమువుతాయి. దీంతో పాటు చుండ్రు, జుట్టు రాలడం సమస్యలు కూడా తగ్గుతాయి. 


ఎముకల ఆరోగ్యం: 
తోటకూరలో కాల్షియం, విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది.


గుండె సమస్యలకు: 
తోటకూరలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడానికి, హృదయ స్పందన రేటును సమతుల్యం చేయడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం: 
తోటకూరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రయను ఆరోగ్యంగా చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.


చర్మ ఆరోగ్యం: 
తోటకూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసిపోయేలా చేస్తుంది. ముడతలు, చర్మం తొలగించి అనేక రకాల చర్మ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.