Home Cleaning Tips: అరటిపండు తొక్కపై నిమ్మకాయను రాస్తే ఏమౌతుందో తెలుసా?
Home Cleaning Tips: అరటిపండు తింటే తక్షణ శక్తితోపాటు ముఖం, హెయిర్ సమస్యలకు కూడా ఉపయోగిస్తారు. అయితే, ఇంటి పనుల్లో కూడా అరటిపండును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
Home Cleaning Tips: అరటిపండు తింటే తక్షణ శక్తితోపాటు ముఖం, హెయిర్ సమస్యలకు కూడా ఉపయోగిస్తారు. అయితే, ఇంటి పనుల్లో కూడా అరటిపండును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
బంగారు ఆభరణాలు..
అరటిపండు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో దాని తొక్కలో కూడా అంతే ఉపయోగాలు ఉంటాయి. సాధారణంగా అందరి ఇళ్లలో బంగారు ఆభరణాలు కొన్ని రోజుల తర్వాత మెరుపు కోల్పోతాయి. వీటిని మెరుగుపెట్టించడానికి బంగారం తయారీ దారుల వద్ద కు పరుగుతీస్తారు. అయితే, ఇంట్లోనే కేవలం అరటిపండు తొక్కతో కూడా మీ బంగారు ఆభరణాలను మెరిపించవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం.
బంగారు ఆభరణాలు తిరిగి మెరిపించడానికి ముందుగా అరటిపండు తొక్కను తీసుకోవాలి. ఆ తర్వాత ఒక పాత్రలో నిమ్మరసం తీసి, అరటి తొక్కపై నిమ్మకాయను రుద్దాలి.
దీంతో మీ ఆభరణాలు లేదా పాత్రలపై రుద్దండి. నిమ్మ ,అరటి తొక్కలలో సహజ క్లీనింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి.. ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి మీ ఆభరణాలకు కూడా ఎలాంటి హాని కలుగుతుందనే భయం ఉండదు..
ఇదీ చదవండి: Glowing Skin Tips: గ్లోయింగ్ స్కిన్‌కు ఖరీదైన క్రీమ్స్ అవసరంలేదు.. ఈ ట్రిక్ పాటించండి చాలు..
తోలు వస్తువులు..
అరటి తొక్క ,నిమ్మకాయ సహాయంతో మీ ఇంటి తోలు వస్తువులను కొత్తవిగా మార్చుకోవచ్చు. ఓ బ్రష్ సహాయంతో బ్యాగ్‌పై నిమ్మరసం రాసి అరటిపండు తొక్కతో రుద్దాలి. ఇలా చేయడం వల్ల తోలు వస్తువులపై ఎలాంటి మరకలు ఉన్న వెంటనే తొలగిపోతాయి. అవి కొత్తవాటిలా మెరుస్తాయి.
ఇదీ చదవండి: Bra Hooks: బ్రాలో 3 హుక్స్ ఎందుకు ఉంటాయో తెలుసా? ఇది చాలా మందికి తెలియదు..!
షూ పాలీష్..
అరటిపండు తొక్క ఉంటే చాలు. షూ పాలిష్ కోసం మార్కెట్‌కి వెళ్లాల్సిన అవసరంలేదు. దీంతో మీ బూట్లు ఇంట్లోనే మళ్లీ కొత్తవాటిలా మెరిసేలా చేయవచ్చు.
ముందుగా అరటిపండు తొక్కపై నిమ్మరసం వేయాలి.
ఇప్పుడు మీ బూట్లను అరటిపండు మృదువైన భాగంతో రుద్దండి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter