Sun Tan Home remedies: ఎండకాలం ఏం కాస్త బయటకు వెళ్లినా ముఖం మీద ఎండ ప్రభావం వల్ల ట్యాన్ అవుతుంది. ముఖంపై సన్ ట్యాన్ పేరుకుంటే కొన్ని వందల రూపాయాలు పెట్టి మరీ బాగు చేయించుకుంటాం. అయితే, కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని హోం రెమిడీలు పాటిస్తే ముఖంపై పేరుకున్న ట్యాన్ తగ్గిపోతుంది. మీ ముఖంపై కూడా మెరుపు తిరిగి వస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలు..
ఎండలో ట్యాన్ అయిన స్కిన్ కు వేల రూపాయాలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం కుంకుమవూవు, పాలు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకుంటే సరి. కుంకుమపూవు మీ ముఖానికి పునరుజ్జీవనం ఇస్తుంది. దీంతో మీ ముఖం కాంతివంతంగా మెరవడం ఖాయం.


బంగాళదుంప..
ముఖంపై సన్ ట్యాన్ తగ్గించుకోవడానికి బంగాళదుంప ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. మీ ముఖంపై బంగాళదుంప రసం అప్లై చేస్తే ముఖంపై పేరుకున్న సన్ ట్యాన్ తొలగిపోతుంది. బయట ఎండలోకి వెళ్లి వచ్చినా బంగాళదుంపను స్లైసులుగా కట్ చేసి ముఖానికి రుద్దుకోవాలి. ఇలా ఓ పదినిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటే సరిపోతుంది. బంగాళదుంప వల్ల ముఖానికి మెరుపు వస్తుంది కూడా.


ఇదీ చదవండి: ఈ 5 పండ్లు నెలరోజులపాటు తింటే.. పాడైన లివర్ కూడా పనిచేయాల్సిందే..


బియ్యం పిండి..
సన్ ట్యాన్ తో బాధపడేవారు తిరిగి ముఖంపై మెరుపు పెంచుకోవాలంటే బియ్యం పిండి ప్యాక్ వేసుకోవాలి. బియ్యం పిండి, పాలు రెండిటినీ కలిపి ప్యాక్ వేసుకోవాలి. బియ్యం పిండి, పాలు, పసపు కలిపి ముఖంపై ప్యాక్ వేసుకోవాలి. ఇలా ఓ 15 నిమిషాల తర్వాత ముఖం సాధారణ నీటితో కడిగితే సరిపోతుంది. పాలు పడని వారు ఈ ప్యాక్ లో రోజ్ వాటర్ అప్లై చేసుకోవచ్చు.


ఇదీ చదవండి: ఈ 5 హెల్తీ ఫుడ్స్ థైరాయిడ్ రోగులకు శాపంగా మారతాయా


బొప్పాయి..
సన్ ట్యాన్ తొలగించడానికి బొప్పాయి కూడా ఎంతో సర్థవంతంగా పనిచేస్తుంది. పండిన బొప్పాయి, తేనెను కలిపి ప్యాక్ వేసుకోవాలి. సాధారణంగా ఫేషియల్లలో బొప్పాయిని ఉపయోగిస్తారు. ప్రధానంగా ఇది ముఖంపై పేరుకున్న ట్యాన్ తొలగిస్తుందని బొప్పాయితో ఫేషియల్ చేస్తారు. ఈ ప్యాక్ వేసుకుని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే సరిపోతుంది. మీ ముఖం కాంతివంతంగా వెలిగిపోతుంది కూడా.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి