Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు ఇవాళ జాగ్రత్తగా ఉండాలట!
నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. ఒక రాశి వారికి ఇవాళ చాలా బాగుంటే... ఇంకొన్ని రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంకొన్ని రాశుల వాళ్లకు ఉద్యోగం, వ్యాపారం విషయాల్లోనూ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఇబ్బందులు తప్పవో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 5, ఆదివారం నాటి మీ రాశి ఫలాలుపై ఓ లుక్కేయాల్సిందే.
నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. ఒక రాశి వారికి ఇవాళ చాలా బాగుంటే... ఇంకొన్ని రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంకొన్ని రాశుల వాళ్లకు ఉద్యోగం, వ్యాపారం విషయాల్లోనూ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఇబ్బందులు తప్పవో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 5, ఆదివారం నాటి మీ రాశి ఫలాలుపై ఓ లుక్కేయాల్సిందే.
ఏప్రిల్ 5, ఆదివారం నాటి మీ రాశి ఫలాలు
మేష రాశి 5 ఏప్రిల్ 2020 ( మేష రాశి వారి జాతకం )
మీకు స్నేహితులు, సోదరుల మద్దతు లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఒక ప్రణాళికతో చేసే పనులు ఏవైనా ఉంటే.. అవి ఇవాళ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఆస్తికి సంబంధించిన పనులపై దృష్టి సారిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శక్తి, ఏదో తెలియని ఉత్తేజం కలుగుతుంది. బేరసారాలలో కూడా మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబం, వ్యక్తిగత జీవితం, ఆర్థిక లావాదేవీలు లాంటి పనులతోనే ఈరోజును గడిపేస్తారు. తప్పనిసరి అవసరాలకు సంబంధించిన ప్రణాళికలు చేసుకోవడానికి ఇవాళ బాగుంటుంది. మీ బాధ్యతలపై పూర్తి శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ జీవిత భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించండి. ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.
వృషభ రాశి 5 ఏప్రిల్ 2020 ( వృషభ రాశి వారి జాతకం )
మీకు ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల కారణంగా మీరు ఒక ముఖ్యమైన అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ రోజు మీరు ఏ నిర్ణయాన్ని అంత సులభంగా తీసుకోలేరు. ఎటువంటి తీర్మానాలు చేయలేరు. మనస్సు కొంత గందరగోళంగా ఉండటమే అందుకు కారణం. ఏ విషయంలోనైనా కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎదుటివారితో ఆచితూచీ మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇతరుల మాట వినడానికి ప్రయత్నించండి. ఆరోగ్యరీత్యా ఎలాంటి ఇబ్బందులు లేవు.
మిథున రాశి 5 ఏప్రిల్ 2020 ( మిథున రాశి వారి జాతకం )
ఎప్పటి నుండో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఈ రోజు బాగుంటుంది. ఏదైనా కొత్త ఆఫర్ కూడా అందుకునే అవకాశాలున్నాయి. ఆలోచించి పనిచేయడం ప్రారంభించండి. మీ పని త్వరలోనే పూర్తవుతుంది. రోజువారీ పనులు పూర్తి చేయడంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. ముఖ్యమైన పని కోసం ఈ రోజు శుభప్రదమైనది. ఇతరత్రా సమస్యలు కూడా త్వరలోనే సమసిపోయే అవకాశం ఉంది.
కర్కాటక రాశి 5 ఏప్రిల్ 2020 ( కర్కాటక రాశి వారి జాతకం )
లవ్ లైఫ్లో ఒకరినొకరు అపార్థాలు చేసుకునే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. ఉద్యోగం, వ్యాపారంలో నిర్లక్ష్యంగా లేదా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రణాళికాబద్ధమైన పనిని పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. కర్కాట రాశి వారు ఈ రోజు ఆరోగ్యంలో అజాగ్రత్తగా వ్యవహరించరాదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పక పాటించాలి.
సింహ రాశి 5 ఏప్రిల్ 2020 ( సింహ రాశి వారి జాతకం )
ఈ రోజు మీరు అనేక రకాల ఆలోచనలు చేయవచ్చు కానీ మీరు అనుకున్న పనులు అన్ని పూర్తి కావు. కొన్ని మాత్రమే పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. మనస్సులో ఏదో తెలియని వెలితి, సమస్య ఉంటుంది. ఈ రోజు ఎలాంటి ప్రణాళికలి రచించొద్దు. పాత పనిని పూర్తి చేయడానికే మొగ్గుచూపండి. జాగ్రత్తగా వ్యవహరించండి. పనిలో మనస్సు లగ్నం చేయలేకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు.
కన్యా రాశి 5 ఏప్రిల్ 2020 ( కన్యా రాశి వారి జాతకం )
వ్యాపారంలో కొన్ని కొత్త పథకాలపై పని ప్రారంభించవచ్చు. మీరు మీ భాగస్వామి నుండి సహాయసహకారాలతో పాటు ఆనందాన్ని కూడా పొందుతారు. లవ్ లైఫ్లో ఉన్న వారికి ఇవాళ రోజు మంచిది. అకస్మాత్తుగా ఇవాళ మీరు ఒక ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశాలున్నాయి. ఈ రోజు మీరు మీ పనిపై దృష్టిసారించండి. అసంపూర్తిగా ఉన్న పనిని సమయానికి పరిష్కరించవచ్చు. అప్పటివరకు ఓపికపట్టండి. మీ మనస్సు, మీ ఆరోగ్యం బాగుంటాయి.
తులా రాశి 5 ఏప్రిల్ 2020 ( తులా రాశి వారి జాతకం )
ఈ రోజు మీకు మంచి రోజు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నందున ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవాళ మీకు కొన్ని మంచి అవకాశాలు కూడా ఎదురుకావొచ్చు. మీరు వాటిని సద్వినియోగం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. జీవిత భాగస్వామితో అనుబంధం విషయంలోనూ ఇవాళ అనుకూలత కనిపిస్తోంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చిక రాశి 5 ఏప్రిల్ 2020 ( వృశ్చిక రాశి వారి జాతకం )
ఉద్యోగాలు, వ్యాపారంలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నష్టాలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. మనసు కొంత గందరగోళంగా ఉంటుంది. ఊహించని ముప్పు ఏదో ముంచుకొస్తున్నట్టుగా ఉంది. అనవసరమైన ఖర్చులు కూడా వచ్చిపడే ప్రమాదం ఉంది. పనిచేసే చోట కొంత అసౌకర్యం ఉండవచ్చు. ఏదైనా సమస్య ఉంటే, తొందరపాటు లేకుండా మీరు దానిని చాలా జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి. మీ చుట్టూ ఉండే వ్యక్తులే ఈరోజు మిమ్మల్ని బాధించే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు ఇష్టం లేకపోయినా మీరు రెండు వైపులా మాట్లాడవలసి ఉంటుంది. ఆరోగ్యం హెచ్చుతగ్గులకు లోనవుతుంది.
ధనుస్సు రాశి 5 ఏప్రిల్ 2020 ( ధనుస్సు రాశి వారి జాతకం )
ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు వినయంతో ఉండగలిగితే.. సంక్లిష్టమైన సమస్యలను సైతం అధిగమించగలరు. రుణం తీసుకునే ఆలోచనలు చేస్తారు. మీరు మీ పిల్లల నుండి మద్దతు పొందవచ్చు. ఉద్యోగరీత్యా ఉన్న అంతరాయాలు అంతమవుతాయి. మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
మకర రాశి 5 ఏప్రిల్ 2020 ( మకర రాశి వారి జాతకం )
ఈ రోజు మీరు రోజంతా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వారి స్వార్థం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఇవాళ మీకు ఏ సమస్యకైనా పరిష్కారం లభించదు. మీరు ప్రత్యేకంగా భావించే కొన్ని పనులు ఇవాళ పూర్తి చేయలేరు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకోకపోతేనే మంచిది. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు లేవు.
కుంభ రాశి 5 ఏప్రిల్ 2020 ( కుంభ రాశి వారి జాతకం )
ఈ రోజు మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. నిలిచిపోయిన పనిని పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుభవంతో పనిచేస్తే మీ సమస్యలను మీరే పరిష్కరించవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మీన రాశి 5 ఏప్రిల్ 2020 ( మీన రాశి వారి జాతకం )
వ్యాపారంలో ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని అనుకుని లేనిపోని ఇబ్బందులు కొనితెచ్చుకోకండి. మనసులో చికాకుల కారణంగా ఈరోజు మీరు పనిపై దృష్టిపెట్టలేరు. ఉద్యోగాలు, వ్యాపారం విషయంలో ఈ రోజు ఆత్రుత పనికిరాదు. రిస్క్ తీసుకోవడం కూడా మానుకోండి. మీరు చేసిన పనికి సంబంధించి ఫలితాన్ని రాబట్టుకోలేకపోతే దానిగురించే ఆలోచిస్తూ ఆందోళన చెందకండి.. ఎందుకంటే ఇదొక దశ మాత్రమే. ఆరోగ్యం విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు గోచరిస్తున్నాయి.
సర్వేజనా సుఖినోభవంతు.