ఏప్రిల్ 2, గురువారం నాడు మీ రాశి ఫలాలు 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి 2 ఏప్రిల్ 2020


నిరుద్యోగులకు ఈ రోజు బాగుండే అవకాశాలున్నాయి. మీరు కెరీర్‌లో ముందుకు సాగడానికి మరిన్ని అవకాశాలు పొందొచ్చు. మీరు ఆత్మ విశ్వాసంతో కనుక ముందడుగేసినట్టయితే.. ఇబ్బందికరమైన పరిస్థితులను సైతం అధిగమించి విజయం సాధించే అవకాశాలున్నాయి. డబ్బు, వ్యాపార వ్యవహారాల్లో ఈ రాశి వారికి కాస్త జాగ్రత్త అవసరం. సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. మీ ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది.


వృషభ రాశి 2 ఏప్రిల్ 2020


ఆఫీసు నుండి చాలా పని ఒత్తిడి ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం గోచరిస్తోంది. మానసిక ఇబ్బందుల కారణంగా పనిపై దృష్టి పెట్టడంలో ఇబ్బందులు తప్పేలా లేవు. ఎక్కువగా ఆలోచించవద్దు. మీ మనసులో మాటను మీ జీవిత భాగస్వామి వద్ద అస్సలు దాచొద్దు. శారీరకంగా చిన్న చిన్న సమస్యలు తప్పవు.


మిథున రాశి 2 ఏప్రిల్ 2020


వ్యాపారం, ఉద్యోగం విషయాల్లో కుటుంబం నుండి సరైన మద్దతు లభిస్తుంది. ఆఫీసులో సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు ఆచీతూచీ మాట్లాడండి. అభివృద్ధి ద్వారాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇంట్లో ఉపయోగించే ఏదైనా విలువైన, చెప్పుకోదగిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. మీ ఆలోచనను సానుకూలంగా ఉంచండి. నమ్మదగిన వ్యక్తి సహకారం కూడా పొందే అవకాశాలున్నాయి. మీ భాగస్వామి సున్నితమైన మానసిక స్థితిలో ఉంటారు. మీ భావాలు గౌరవించబడతాయి. మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.


కర్కాటక రాశి 2 ఏప్రిల్ 2020


ఏదైనా ఓ కొత్త వ్యాపారం వైపు ఆకర్షితులవుతారు. ఉద్యోగంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆదాయంలో కూడా పెరుగుదల కనిపిస్తోంది. గతంలో మొదలుపెట్టిన ఏదో ఓ ముఖ్యమైన పనిని ఇవాళ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఒక పథకం ప్రకారం వ్యవహరించినట్టయితే.. సమాజంలో తగిన గౌరవం పొదుతారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోయే అవకాశాలున్నాయి. తద్వారా కొత్తగా ఏదైనా సాధించాలి, కొత్తగా ఏదైనా చేయాలనే కోరిక కూడా పెరుగుతుంది.


సింహ రాశి 2 ఏప్రిల్ 2020


గతంలో రాకుండా ఆగిపోయిన డబ్బులు, మీకు రావాల్సి ఉన్న డబ్బులు ఇవాళ తిరిగి వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీరు కూడా మకొకరి నుండి డబ్బులు తీసుకోవలసి ఉంటుంది. ఇవాళ మీరు తలపెట్టే పనులు విజయవంతమవుతాయి. ఏదైనా పనిపై ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. కానీ ఆ పనితో మీకు చాలా ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది ఈ రోజు మీ కోరికలు ఏమున్నా అవి నెరవేరుతాయి. ఒంటరి వ్యక్తులకు మంచి రోజు. వివాహ ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు.


కన్యా రాశి 2 ఏప్రిల్ 2020   


ఉద్యోగం, వ్యాపారం విషయంలో భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకండి. లేదంటే వివాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఏదైనా పాత వివాదం సైతం మళ్లీ ఎదురవచ్చు. కుటుంబ సమస్యలు అలాగే ఉంటాయి. మానసిక ఇబ్బందులు పెరుగుతాయి. ఫలితంగా కొంత ఆందోళనకు గురయ్యే అవకాశాలున్నాయి. వాహనాలను ఉపయోగించే క్రమంలో జాగ్రత్తలు మరింత అవసరం.


తులా రాశి 2 ఏప్రిల్ 2020


మీరు అప్పుల బాధ నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ పనిపై పూర్తి దృష్టి పెట్టండి. ఈ రోజు మీరు కష్టపడి పనిచేయడం కంటే కూడా ఆ పనిని ఒక ప్రణాళికతో పూర్తి చేయాల్సిన అవసరమే ఎక్కువగా కనిపిస్తోంది. కుటుంబం, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, స్నేహితులు, బంధువులకు ఇవాళ మీరు ప్రత్యేకమైన స్థానం ఇస్తారు. మీ ప్రవర్తన మీ భాగస్వామిని సంతోష పెడుతుంది.


వృశ్చిక రాశి 2 ఏప్రిల్ 2020


వ్యాపారం బాగా జరుగుతుంది. మీరు ప్రత్యేకంగా భావిస్తోన్న ఏదైనా పనిని ఇవాళ పూర్తి చేయవచ్చు. మీ ఆరోగ్యం ఇవాళ మీకు బాగా సహకరిస్తుంది. భౌతిక సౌకర్యాల పట్ల మీ ధోరణి పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. భూమి, ఆస్తి కొనుగోలు వ్యవహారాలపై దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి ప్రణాళికలు ఫలితం ఇస్తాయి. ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. తద్వారా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.


ధనుస్సు రాశి 2 ఏప్రిల్ 2020


ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. మీ వ్యాపారంపై పూర్తి దృష్టి కేంద్రీకరిస్తారు. వ్యాపారం, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు ముగుస్తాయి. అనవసరంగా పరుగులు పెట్టే పని ఇక ఉండదు. మీకు ఈ రోజు మంచిగా ఉంటుంది. ఇల్లు, కార్యాలయం.. ఎక్కడైనా వాతావరణం మీకు ఆహ్లాదకరంగానే ఉంటుంది. ప్రేమ జీవితానికి, వివాహ జీవితానికి ఈరోజు మంచి సమయం. అలసట లేదా ఒత్తిడి లాంటి ఇబ్బందులు ఉండవచ్చు.


మకర రాశి 2 ఏప్రిల్ 2020


ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనం పొందుతారు. మీ పనికి తగిన ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో బదిలీ లేదా పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ప్రేమను వ్యక్తపర్చడానికి ఈ రాశి వారికి మంచి రోజు. అమితంగా భుజించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.


కుంభ రాశి 2 ఏప్రిల్ 2020


వ్యాపారంలో స్వయం సమృద్ధి ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. పనితీరు పెరుగుతుంది. మీ చుట్టుపక్కల ఉన్న వారి నుండి మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీరు త్వరలో మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోగలరు. పాత సమస్యలకు పరిష్కారాలు కనుగొనవచ్చు. సీజనల్‌గా వచ్చే వ్యాధులు కూడా కొంత చికాకు కలిగిస్తాయి.


మీన రాశి 2 ఏప్రిల్ 2020


[[{"fid":"183818","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Meena rashifalalu","field_file_image_title_text[und][0][value]":"మీన రాశిఫలాలు"},"type":"media","field_deltas":{"7":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Meena rashifalalu","field_file_image_title_text[und][0][value]":"మీన రాశిఫలాలు"}},"link_text":false,"attributes":{"alt":"Meena rashifalalu","title":"మీన రాశిఫలాలు","style":"float: left;","class":"media-element file-default","data-delta":"7"}}]]ఈ రోజు, మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. క్రమశిక్షణ లేని దినచర్య కారణంగా సోమరితనం, అలసట కలుగుతుంది. కొన్ని చిన్న చిన్న పనుల్లోనూ సమస్యలు ఎదురవుతాయి. మీరు ఆదాయానికి అనుగుణంగా ఖర్చు చేస్తే మంచిది. మీ ఆత్మ విశ్వాసాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఏదో ఒక విషయంలో కొంత అసంతృప్తి కూడా కలిగే ప్రమాదం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. పనితీరులో ఇబ్బందులు పెరుగుతాయి. ఆరోగ్యరీత్యా ఎలాంటి ఇబ్బందులు లేవు.


సర్వేజనా సుఖినోభవంతు.