ఏప్రిల్ 1, బుధవారం నాడు మీ రాశి ఫలాలు 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి 1 ఏప్రిల్ 2020


మీరు ఏదైనా ఫలితం లేదా నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టయితే ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఇవాళ మీకు అన్ని సరైన ఫలితాలే ఎదురవుతాయి. మీరు సాధారణ స్థాయికి మించి ఏదైనా ఇంకాస్త ఎక్కువ శ్రమించటానికి ప్రయత్నిస్తే.. మీకు మరింత మేలు జరుగుతుంది. ఏదేమైనా కష్టే ఫలి అనే సత్యాన్ని మర్చిపోవద్దు. అప్పుడే మీరు ఆశించే ప్రయోజనం భారీగా ఉంటుంది.. ఫలితం ఎక్కువ కనిపిస్తుంది. మీకు కావలసిన పనులను పూర్తి చేయడానికి మీరు కొంచెం వేచి ఉండాల్సి ఉంటుంది. కుటుంబంతో గడపడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారం పరంగా ఇవాళ మీకు మంచి రోజు.


వృషభ రాశి 1 ఏప్రిల్ 2020


మీ అభిప్రాయం, మీ మాటలతో మీరు చాలా మందిని ప్రభావితం చేస్తారు. తమకన్నా తక్కువ వయస్సు ఉన్నవారిని చూసి టెన్షన్ పడే అవకాశాలున్నాయి. సంక్లిష్టమైన పనులను పరిష్కరించడానికి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారవచ్చు. మీ ఆలోచనా విధానం మారవచ్చు. మీరు స్నేహితుల నుండి సకాలంలో సహాయం పొందవచ్చు. కుటుంబానికి సంబంధించిన పనులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు.


మిథున రాశి 1 ఏప్రిల్ 2020


రోజువారీ పనులను నిర్వహించడానికి ఇవాళ మీకు కొంత అదనపు శ్రమ అవసరం ఉంటుంది. మీ బాధ్యతలను గుర్తుంచుకోండి. మీ సమయం, సహనాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. అవి ఈ రోజు మీకు ఎంతో అవసరం. మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. అప్పుడే మీరు చేసే పనిలో విజయం సాధించవచ్చు. చేసే పనుల్లో సానుకూలదోరణితో ఉండటానికి ప్రయత్నించండి.


కర్కాటక రాశి 1 ఏప్రిల్ 2020


మీరు డబ్బు సంపాదించడానికి ప్రయత్నించడంలో ఇవాళ విజయం సాధించవచ్చు. మీరు కొంత పార్ట్ టైమ్ పనిని కూడా పొందవచ్చు. అదనపు పని విషయంలో ఎవరైనా మీకు సహాయం చేయవచ్చు. ఎదుటివారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏవైనా శుభవార్తల కోసం వేచిచూసే వారికి ఇవాళ ఎదురుచూపులు తప్పవు.


సింహ రాశి 1 ఏప్రిల్ 2020


ఈ రోజు మీరు ఏ పనినీ వాయిదా వేయవద్దు. ఈ రోజు మీరు మీ ఉద్యోగం లేదా వ్యాపార లక్ష్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. ఏకాగ్రతతో పనిని నిర్వహించడానికి ప్రయత్నించండి. కొత్త వ్యక్తిని లేదా స్నేహాన్ని కలిసే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ పనికి సంబంధించిన విషయాలను కొంతమంది కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. మీ ఆర్థిక సమస్యలు కుటుంబ సహాయంతో పరిష్కరించుకుంటారు. మనస్సును అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి.


కన్యా రాశి 1 ఏప్రిల్ 2020


ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీరు మీ భావోద్వేగాలను నియంత్రిస్తే, మీరు ప్రయోజనం పొందుతారు. వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులతో సంభాషణలు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అలాంటి వారి నుండి సహాయం పొందే అవకాశాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. ప్రేమను వ్యక్తం చేయాలనుకునేవారికి కూడాఇది మంచి రోజు కానుది. పనులను సకాలంలో పూర్తి చేయవచ్చు. ఎదుటివారి మద్దతుతో మీకు కొంత స్వాంతన లభిస్తుంది.


తులా రాశి 1 ఏప్రిల్ 2020


తుల రాశి వారు ఇవాళ తమ పరిస్థితులను మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇబ్బందులను పరిష్కరించుకోవడంలో ఇవాళ మీరు చాలావరకు విజయవంతమవుతారు. మంచి ప్రవర్తన వల్ల కొంతమంది సహాయం పొందవచ్చు. ఎప్పటి నుండో వాయిదాపడుతూ వస్తున్న పనులు ఇవాళ పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు కొన్ని ప్రత్యేక పనులను నిర్వహించడంలో విజయవంతమవుతారు. పనిపై కూడా ఇవాళ శ్రద్ధ కనబరుస్తారు. ఇవాళ మీరు కొంత సంయమనం పాటించాల్సి ఉంటుంది.


వృశ్చిక రాశి 1 ఏప్రిల్ 2020


చాలా పనులు సులభంగా పూర్తి చేసేస్తారు. మీ చుట్టూ ఉండే వారిపై ఇవాళ మంచి ప్రభావాన్ని చూపుతారు. ఎప్పటినుండో పూర్తికాకుండా ఉంటున్న పనులను పూర్తి చేసేందుకు ఇవాళ ఓ మార్గాన్ని కనుగొంటారు. పనిలో విజయం సాధిస్తారు. ఇంటి సమస్యల పరిష్కారంలో మీ జీవిత భాగస్వామి ఇవాళ మీకు పూర్తి సహాయసహకారాలు అందించవచ్చు. ఎదుటివారితో చాలా మర్యాదగా మాట్లాడండి. మీరు ఈ రోజు వృద్ధులైన పెద్ద వారి నుండి మీకు ఆశీర్వాదాలు లభిస్తాయి.


ధనుస్సు రాశి 1 ఏప్రిల్ 2020


మీరు గత కొన్ని రోజులుగా ప్లాన్ చేస్తున్న పనులను ఈరోజు పూర్తి చేస్తారు. చాలాకాలంగా నెరవేరని కోరికలు ఈరోజు నెరవేరే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో, ప్రయత్నాలలో మీరు విజయవంతమవుతారు. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఎదుటివారితో తీయగా మాట్లాడటం ద్వారా మీరు అన్ని పనులను పూర్తిచేసుకోగలుగుతారు. మీకు ఈ రోజు అదృష్టం కూడా కలిసొస్తుంది. ఆ అదృష్టానికి తోడు మీరు కొంత శ్రమపడితే తప్పక విజయం సాధిస్తారు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీపై మీరు విశ్వాసం కోల్పోవద్దు.


మకర రాశి 1 ఏప్రిల్ 2020


నిరుద్యోగులకు ఉద్యోగాలు పొందవచ్చు. మీరు పరిష్కరించడానికి ఇబ్బందిపడుతున్న విషయాల జోలికి వెళ్లకండి. ఆ పనులను ఇవాళ వాయిదా వేసి మరొక పనిపై దృష్టిసారించండి. కొంతమంది ముఖ్యమైన పనిని పరిష్కరించడంలో ఇతరుల సహాయం పొందే అవకాశాలున్నాయి. దయచేసి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి బాగా ఆలోచించండి. అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా తీసుకోండి. శారీరక రుగ్మతలు తొలగిపోయే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈరోజు బాగా కలిసొస్తుంది. ఇప్పటివరకు మీకు రాకుండా ఆగిపోయిన డబ్బులు ఏవైనా ఉంటే.. ఇవాళ గట్టిగా ప్రయత్నిస్తే వాటిని మీరు రాబట్టుకునే అవకాశాలున్నాయి.


కుంభ రాశి 1 ఏప్రిల్ 2020


ఈ రోజు మీకు సాధారణంగానే ఉంటుంది. ఇబ్బందుల్లో ఉన్న వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులతో అర్థవంతమైన చర్చలు జరిపే అవకాశం ఉంది. తద్వారా వారి నుండి మీరు సహాయం కూడా పొందే అవకాశాలున్నాయి. వివాదాలకు ఎంత దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే అంత మంచిది. వ్యాపార రంగంలో పురోగతి ఉంటుంది. ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు కూడా ఇవాళ ఊపందుకుంటాయి. ఇవాళ మీకు కొన్ని శుభవార్తలు కూడా అందవచ్చు.


మీన రాశి 1 ఏప్రిల్ 2020


రోజువారీ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్నేహితులు, సోదరుల సహాయం పొందుతారు. ఎలాంటి గందరగోళం అయినా తొలగిపోతుంది. డబ్బు, ఇతర ఈరోజు పూర్తి ఆశాజనకంగా, ప్రయోజనం కలిగి ఉంటుంది. ఈ రోజు మీరు మీ పనులతో బిజీగా ఉంటారు. ఎంతో బాధ్యతతో చేసే పనులు కూడా ఇవాళ మీకు ఎదురుకావొచ్చు. మీరు మానసికంగా ఎంతో చురుకుగా ఉంటారు. రోజువారీ పనితీరులో మార్పు ఉండవచ్చు. మీ పనితీరును మెరుగుపరచడానికి ఇది సరైన రోజు.


సర్వేజనా సుఖినోభవంతు.