Tomato Facial Benefits: వర్షాకాలం తేమ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో పాటు చర్మ సమస్యలు కూడా పెరిగే ఛాన్స్‌ ఉంది. కావున చర్మంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వానా కాలంలో చాలా మందిలో చర్మపై దురద, జిడ్డుగా మారుతుంది. అయితే ఈ చర్మానికి మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్‌ వినియోగించకుండా.. ఇంట్లో లభించే పలు రకాల చిట్కాల ద్వారా ఈ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం.. చర్మానికి  టొమాట రసాన్ని వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇది  చర్మాన్ని రిఫ్రెష్ చేయడానికి.. హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పనిచేస్తుంది. ఈ రసాన్ని చర్మానికి అప్టై చేయడం వల్ల ట్యానింగ్ సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఈ టొమాటో ఫేషియల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టమోటా ఫేషియల్‌ని ఎలా చేయాలి, దాని ప్రయోజనాలు:


క్లియరింగ్:
ఫేషియల్‌ను వినియోగించే ముందు తప్పకుండా చర్మాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. టమోటా ఫేషియల్‌తో ముఖాన్ని శుభ్రం చేయడానికి.. ముందుగా దాని రసం తీసుకుని.. అందులో పాలను వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మసాజ్ చేసి.. శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి.


స్క్రబ్బింగ్:
స్క్రబ్బింగ్ వల్ల ముఖంలోని డెడ్ స్కిన్ సెల్స్ అన్ని తొలగించబడతాయి. డెడ్ స్కిన్ ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల ముఖానికి మెరుపు వస్తుంది. స్క్రబ్ చేయాలంటే టొమాటా గుజ్జును తీసి.. అందులో పంచదార మిక్స్ చేసి తేలికపాటి చేతులతో ముఖంపై 3 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ డెడ్ స్కిన్ మొత్తం తొలగిపోతుంది.


టోనింగ్:
స్క్రబ్బింగ్ చేసిన తర్వాత.. చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అయితే టోనర్ చేయడానికి టమోటా రసం తీయాలి. దానికి కొన్ని చుక్కల నిమ్మరసం వేసి.. ఇప్పుడు కాటన్ సహాయంతో ముఖానికి పట్టించాలి. ఇలా అప్లై చేసిన తర్వాత నీటితో శుభ్రం చేస్తే చాలు.. ముఖంపై గ్లో వస్తుంది.


ఫేస్ ప్యాక్
ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖం మెరుస్తుంది. చర్మం బిగుతుగా మారుతుంది. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి.. ముందుగా టమోటా రసంలో బియ్యం పిండిని కలిపి.. ఈ పేస్ట్‌ను ముఖంపై 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Jabardasth Praveen : జబర్ధస్త్ ప్రవీణ్ ఇంట్లో విషాదం.. కోలుకోలేని దుఖంలో ప్రవీణ్


Also Read: Nassar: సినీ నటుడు నాజర్‌కు గాయాలు..ఆస్పత్రికి తరలింపు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి