Unhealthy Tongue Colour: నాలుక రంగు బట్టి మీ వ్యాధి గురించి తెలుసుకోవచ్చు..!
Tongue Colour Symptoms: నాలుక రంగును బట్టి మీరు ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అనే విషయం తెలుసుకోవచ్చని తెలుసా..? ఏ రంగు ఎలాంటి సమస్య కు సూచన అనే వివరాలు తెలుసుకుందాం.
Tongue Colour Symptoms: సాధారంగా మనం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్లి చికిత్స పొందుతాము. కొన్నిసార్లు వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యల లక్షణాలను గుర్తిస్తాము. కానీ ఎలాంటి వైద్య పరీక్షలు లేకుండా మనం ఎలాంటి ఆరోగ్యసమస్యతో ఇబ్బంది పడుతున్నాం అనేది మన నాలుక రంగుతో తెలుస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది నిజం కొన్ని వ్యాధులతో బాధపడుతున్నప్పుడు నాలుక ద్వారా సమస్యను తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
నాలుక రంగు:
సాధారణంగా మన నాలుక గులాబీ రంగులో ఉంటుంది. దీనికి అర్థం మనం ఆరోగ్యంగా ఉన్నామని సంకేతం. కొన్నిసార్లు నాలుక అనేది లేత రంగు నుంచి ముదురు రంగుల్లోకి మారుతుంటుంది. ఈ రంగులను బట్టి మీరు ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నారు అనేది తెలుసుకోవచ్చని క్లీవ్ల్యాండ్ క్లినిక్ నివేదికలో తెలిపారు. ఇప్పుడు ఏ రంగు ఎలాంటి అనారోగ్య సమస్యకు సంకేతం అనేది తెలుసుకుందాం.
తెలుపు రంగు:
నోటిలో నాలుక తెలుపు రంగులో ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నారని అర్థం. దీని వల్ల నోటిలో అధికంగా ఈస్ట్, బ్యాక్టీరియా ఉత్పత్తి పెరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాగే దీని వల్ల వాపు వచ్చే ప్రమాదం ఉంటుంది.
పసుపు రంగు:
పసుపు రంగులో నాలుక కనిపిస్తే బ్యాక్టీరియా పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రతిరోజు నోటిని శుభ్రంగా కడుకోవాలి. అలాగే శరీరానికి తగినంత నీరు తీసుకోవాలి, ధూమపానం తగ్గించాలి.
ఎర్ర రంగు:
నాలుక అనేది ఎర్ర రంగులో ఉండే అలర్జీ సమస్యతో బాధపడుతున్నారని అర్థం. అలాగే శరీరంలో విటమిన్ ఎ, బి లోపం కూడా దీనికి కారణం.
బ్లూ రంగు:
బ్లూ రంగులో ఉండే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. ఊపిరితిత్తులలో ఆక్సిజన్ తక్కువగా ఉందని సూచన.
గ్రే రంగు:
మీ నాలుక కానీ గ్రే రంగులో ఉండే తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఏం చేయాలి:
నాలుక రంగులో ఏదైనా మార్పు గమనిస్తే జనరల్ ఫిజీషియన్‌ని సంప్రదించండి. అలాగే నోటి పరిశుభ్రతను మెరుగుపరచుకోవాలి. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి, రోజుకు ఒకసారి ఫ్లోస్ చేయండి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. శరీరానికి తగినంత నీరు తాగండి. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.
గమనిక: నాలుక రంగు మార్పులు ఎల్లప్పుడూ తీవ్రమైన వ్యాధికి సంకేతం కావు. కొన్నిసార్లు, అది తాత్కాలికంగా ఉండవచ్చు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.