Google Questions: ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి గూగుల్ ఓ మంచి వేదిక. గూగుల్ అంటేనే ఓ అరుదైన అవకాశంగా భావిస్తారు చాలామంది. అసలు చాలామందికి గూగుల్ ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయనే ఆసక్తి కూడా ఉంటుంది. గూగుల్ ఇంటర్వ్యూల్లో వివిధ సందర్భాల్లో అడిగిన పలు ప్రశ్నలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ప్రశ్నల్లో ఓ 20 ప్రశ్నల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. అసోసియేట్ ఎక్కౌంట్ స్టాటెజిస్ట్ పోస్ట్ కోసం 2014 మార్చ్ నెలలో అడిగిన ప్రశ్న ఇది. ఒక వాక్యాన్ని గుర్తు పెట్టుకోవల్సి వస్తే..ఏం గుర్తు పెట్టుకుంటారు. 


2. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్ట్ కోసం 2016 జనవరిలో అడిగిన ప్రశ్న ఇది. మీరు సంపాదనను ఇష్టపడతారా లేదా నేర్చుకోవడాన్ని ఇష్టపడతారా


3. బిజినెస్ ఎనాలిస్ట్ పోస్ట్ కోసం 2014లో అడిగిన ప్రశ్న ఇది. ఓ బిల్డింగ్ ఖాళీ చేసే ప్లాన్ డిజైన్ చేయండి


4. ఇంట్రాక్షన్ డిజైనర్ పోస్ట్ కోసం 2014 సెప్టెంబర్‌లో అడిగిన ప్రశ్న ఇది. మీకు పని లేకపోతే ఏం చేయడానికి ఇష్టపడతారు


5. ప్రొడక్ట్ మేనేజర్ పోస్ట్ కేసం 2015 నవంబర్‌లో అడిగిన ప్రశ్న ఇది. ఆరేళ్ల బాలుడికి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో ఎలా వివరిస్తారు


6. ఎక్కౌంట్ స్ట్రాటెజిస్ట్ పోస్ట్ కోసం 2014లో అడిగిన ప్రశ్న ఇది. మీరే కనుక సీఈవో అయితే మీ యూనివర్శిటీ లేదా వర్క్‌ప్లేస్‌లో మార్చాలనుకునే మూడు అంశాలేంటి


7. ప్రొడక్ట్ మేనేజర్ పోస్ట్ కోసం 2015లో అడిగిన ప్రశ్న ఇది. మీకు 24 గంటల్లో డెలివరీ చేసే గ్రోసరీ సర్వీస్ ఉంది. మీ సర్వీస్‌కు ఎన్ని ట్రక్కులు కావల్సి వస్తాయి


8. క్రియేటివ్ స్పెషలిస్ట్ పోస్ట్ కోసం 2016 జనవరిలో అడిగిన ప్రశ్న ఇది.  లారీపేజ్‌కు హెచ్‌టీ‌ఎమ్‌ఎల్ 5 ఏ మేరకు అవసరమనేది మీ నానమ్మకు ఎలా వివరిస్తారు


9. యాడ్‌వర్డ్స్ అసోసియేట్ పోస్ట్ కోసం అడిగిన ప్రశ్న ఇది. ఆగ్రహంగా లేదా ఫ్రస్టేషన్‌తో ఉన్న ప్రకటనదారుల్ని ఫోన్‌లో ఎలా డీల్ చేస్తారు


10. బిజినెస్ అసోసియేట్ పోస్ట్ కోసం అడిగిన ప్రశ్న ఇది. అమెరికాలో రోజుకు ఎన్ని హెయిర్ కట్స్ అవుతుంటాయని మీరు అనుకుంటున్నారు


11. బోల్డ్ క్యాండిడేట్ పోస్ట్ కోసం అడిగిన ప్రశ్న ఇది. జీమెయిల్ వాడుతున్నందుకు నెలకు 1 డాలర్ వసూలు చేస్తే గూగుల్‌పై అభిప్రాయమేంటి


12. క్వాంటిటేటివ్ కంపెన్సేషన్ ఎనాలిస్ట్ పోస్ట్ కోసం అడిగిన ప్రశ్న ఇది.  ట్రయాంగిల్ కోసం స్టిక్‌ను మూడు ముక్కలుగా చేయాలంటే మీకున్న అవకాశాలేంటి


13. ప్రొడక్ట్ మేనేజర్ పోస్ట్ కోసం అడిగిన ప్రశ్న ఇది. క్లాక్‌లో చేతులు రోజుకు ఎన్నిసార్లు ఓవర్ లాప్ అవుతాయి.


14. ఇంజనీర్ పోస్ట్ కోసం అడిగిన ప్రశ్న ఇది.  2 టుది పవర్ ఆఫ్ 64 ఎంత


15. బిజినెస్ అసోసియేట్ పోస్ట్ కోసం అడిగిన ప్రశ్న ఇది. హేస్టాక్‌లో సూదిని గుర్తించేందుకు ఎన్ని విధాలున్నాయి.


16. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్ కోసం 2014లో అడిగిన ప్రశ్న ఇది. జీమెయిల్ లేదా గూగుల్ ప్లస్ ఓపెన్ చేసేటప్పుడు అసలు పేరు అవసరం లేదంటే మీ అభిప్రాయం ఏంటి


17. క్వాంటిటేటివ్ ఎనాలిస్ట్ పోస్ట్ కోసం అడిగిన ప్రశ్న 2015 సెప్టెంబర్‌లో. ఒక కాయిన్ వేయిసార్లు ఎగురవేసినప్పుడు 560 సార్లు హెడ్ పడింది. ఆ కాయిన్ బయాస్డ్‌గా ఉన్నట్టా లేదా


18. ప్రొడక్ట్ మేనేజర్ పోస్ట్ కోసం 2015లో అడిగిన ప్రశ్న ఇది. శాన్‌ఫ్రాన్సిస్కో డౌన్‌టౌన్‌లో నివాసం లేకపోవడమనే సమస్యను ఎలా పరిష్కరిస్తారు


19. డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ కోసం 2015 డిసెంబర్లో అడిగిన ప్రశ్న ఇది. ఒక స్పేస్‌క్రాఫ్ట్ , 1 బిలియన్ డాలర్ నగదు ఇస్తే మనుష్యుల అతిపెద్ద సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తారు.


20. ప్రొడక్ట్ స్పెషలిస్ట్ పోస్ట్ కోసం అడిగిన ప్రశ్న ఇది. బీయింగ్ గూగ్లీ అంటే మీ దృష్టిలో ఏంటి


Also read: Post Covid Symptoms: గుండెపోటు పొంచి ఉంది, పోస్ట్ కోవిడ్‌లో తస్మాత్ జాగ్రత్త


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook