Belly Fat Drinks In The Morning: బెల్లీ ఫ్యాట్ అనేది పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సూచిస్తుంది. ఇది చర్మం కింద కనిపించే "సబ్‌క్యూటేనియస్ కొవ్వు"  అంతర్గత అవయవాల చుట్టూ ఉండే "విసెరల్ కొవ్వు" రెండింటినీ కలిగి ఉంటుంది. "విసెరల్ కొవ్వు" అనేది హానికరమైన కొవ్వు అని కూడా పిలుస్తారు. ఇది గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్  కొన్ని రకాల క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెల్లీ ఫ్యాట్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా అధిక కేలరీలు ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా మీ శరీరం ఆ కేలరీలను కొవ్వుగా నిల్వ చేస్తుంది. అంతేకాకుండా ప్రాసెస్‌ చేసిన ఆహారాలు ఫాస్ట్‌ ఫుడ్‌, చెక్కర అధికంగా ఉండే పానీయాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. 


అధిక చెక్కర ఉన్నపదార్థాలు అతిగా తీసుకోవడం, అతిగా వేయించిన ఆహారపదార్థాల తినడం, కార్బోహైడేట్స్‌ కలిగిన కూల్‌ డ్రింక్స్‌ తీసుకోవడం  పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు తక్కువగా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ పెరుగుతుంది. వ్యాయమం చేయకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరుకుపోతుంది. దీని కారణంగా దీర్ఘకాలిక ఒత్తిడి కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. 


అంతేకాకుండా వయస్సు పెరిగేకొద్దీ, ముఖ్యంగా మహిళల్లో, కొవ్వును కోల్పోవడం కష్టతరం మారుతుంది.  కాబట్టి ఈ ఆహారపదార్థాలు బదులుగా ఆరోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, తీసుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు తగ్గుతాయి. వీటితో పాటు క్రమం తప్పుకుండా వ్యాయామం చేయడం వల్ల కొవ్వు కరుగుతుంది. దీని వల్ల ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. 


బెల్లీ ఫ్యాట్‌ ను తగ్గించడంలో కొన్ని డ్రింక్స్ ఎంతో ఉపయోగపడుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల సులుభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే ఆ డ్రింక్స్ ఏంటో మనం తెలుసుకుందాం. 


నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్‌ నిమ్మరసం, కొంచెం తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. 


బెల్లీ ఫ్యాట్‌ తగ్గడానికి మరో డ్రింక్‌ రాత్రంతా టీస్పూన్‌ జీలకర్ర విత్తనాలను నీటిలో నానబెట్టి వాటిని ఉదయం వడగట్టి తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పుదీనా వాటర్ బెల్లీ ఫ్యాట్‌ కు మంచి ఔషధం. దీని తీసుకోవడం వల్ల కడుపులోని వాపు తగ్గుతుంది. అలాగే అల్లం నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని చిన్న చిన్న ముక్కులు తీసుకొని నీటిలో మరిగించి, వడగట్టి తీసుకోడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. 


ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది బెల్లీ ఫ్యాట్‌ కు ఎంతో ఉపయోగపడే డ్రింక్‌, మాత్రమే కాకుండా రక్తంలో చెక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. కడుపులోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. 


గమనిక: ఈ పానీయాలతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం తినడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా బెల్లీ ప్యాట్‌ను తగ్గించడానికి చాలా ముఖ్యం.


Read more: Snakes Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి