AI Cannot Replace Jobs: ఈ మధ్యకాలంలో ఏఐ ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల చాలామంది జాబులు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని కూడా వార్తలు వెల్లువెత్తాయి. అయితే, మన దేశంలో 10 అత్యధిక జీతాలు పొందే జాబ్స్‌. వీటిని ఏఐ కూడా భర్తీ చేయలేదని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం.
థెరపిస్ట్..
ఏఐ కూడా రీప్లేస్ చేయాలని జాబితాలో వచ్చే అత్యధిక జీతం పొందగిలిగే జాబ్‌ థెరపిస్ట్. ఇది మొదటి వరుసలో వచ్చేది. అంతే కాదు మెంటల్ హెల్త్ పరంగా మన ఆరోగ్యానికి కౌన్సిలింగ్ ఇచ్చే కౌన్సిలర్ జాబ్ కూడా ఈ జాబితాలోనే వస్తుంది. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఉన్నవాళ్లు యాక్టివ్ గా ఉంటారు, మనుషులు చెప్పేది పూర్తిగా వింటారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వ్యక్తులకే సాధ్యం అవుతుంది కానీ, మెషిన్ కి కాదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ వర్కర్..
ఈ సోషల్ వర్కర్ జాబ్ వ్యక్తులకే సాధ్యపడుతుంది. ఇతరులతో మాట్లాడడం ఇంటరాక్షన్ అవ్వడం కీలకం. ఇతరుల బాధకసాధలు అర్థం చేసుకోవాలి. వాళ్ళ సమస్యలని పరిష్కారాలు కనిపెట్టాలి నమ్మకం కలిగించాలి ఇది ఏఐ కి సాధ్యం కానిది కేవలం మానవులకే సాధ్యం.


అనలిస్ట్..
ఈ జాబ్ కూడా ఏఐతో రీప్లేస్ కానిది ఎందుకంటే అనలిస్ట్ అనేది క్రియేటివ్ ప్రాబ్లెమ్ సాల్వింగ్ క్రిటికల్ గా ఆలోచించాల్సిందే ఉంటుంది. అనలిస్ట్‌ అంటేనే ఎక్కువ నైపుణ్యత కలిగిన జాబ్. పెద్ద పెద్ద ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో ఇమడగలరు.


హెల్త్ కేర్ ప్రొఫెషనల్..
హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అంటేనే సర్జరీలు ఇతర మెడికల్ పనులు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా AI తో రీప్లేస్ కానిది.


 మ్యూజిషియన్..
క్రియేటివ్ గా కనిపించడం, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ మ్యూజిషియన్‌ కు, ఆర్టిస్టులకు మాత్రమే సాధ్యం అంటే ఇది మొత్తం ఎమోషన్ తో కూడుకున్నది ఇది ఏఐ చేయలేదు.


జడ్జస్ ,లాయర్స్..
జడ్జెస్, లాయర్స్ అంటే లీగల్ ఇష్యులను అర్థం చేసుకోవడం వాళ్లకు సామాజిక న్యాయం చేయడం ఇతరుల నడవడిని గుర్తించి తత్వం కలిగి ఉండటం ఇది ఏఐకి అస్సలు సాధ్యం కాని అంశం.


ఇదీ చదవండి:ఈ 8 లక్షణాలు మీలో ఉంటే.. మీరు ఇంటలిజెంట్ అయి ఉంటారు..


లీడర్‌షిప్..
లీడర్‌షిప్ మేనేజ్మెంట్ రోల్స్ అంటేనే ఇతర ఎంప్లాయిస్ ని మోటివేట్ చేయడం, టీం ని ఎప్పటికప్పుడు లోపాలను సరిదిద్దడం చేయడం. ఇది ఏఐకి సాధ్యం కాదు. ఇవన్నీ మానవులకు మాత్రమే సాధ్యమైన పని.


హెచ్ ఆర్..
హెచ్ఆర్ అంటేనే హ్యూమన్ రిలేషన్. ఇది కూడా ఏఐకి సాధ్యం కాదు కేవలం మానవ మాత్రానికే సాధ్యమవుతుంది.  హెచ్ ఆర్ అంటేనే కొత్త వ్యక్తులను ఆర్గనైజేషన్ కి రిలేషన్షిప్ ని ఏర్పాటు చేయడం సరైన వ్యక్తులను ఎంచుకోవడం.


 కస్టమర్ సర్వీస్..
ఇది కస్టమర్ అవసరాలను అంచనా వేస్తూ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది ఏఐకి ఎంత మాత్రం సరిపోనిది.


ఇదీ చదవండి:మీ ముఖానికి ఫేస్ టోనర్ ఉపయోగిస్తే చాలు.. రెట్టింపు గ్లోయింగ్‌ స్కిన్‌ మీసొంతం..


 సైంటిస్ట్ ఇంజినీర్స్..
సైంటిస్టులు ఆవిష్కరించే కొత్త విషయాలు, కొత్త అంశాలు, అధ్యయనాలు ఇవన్నీ మానవమాత్రులకే సరిపోతాయి. ఏఐతో భర్తీ కాని జాబితాల్లో సైంటిస్ట్ ఇంజనీర్స్ కూడా ఉంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి