Reduce Bad Cholesterol: ఆధునిక జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా మనలో చాలా మంచి వయసుతో సంబంధం లేకుండా వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ తో బాధపడుతున్నారు. ఈ చెడు కొలెస్ట్రాల్ కారణంగా ప్రమాదకరమైన సమస్యలు కలుగుతున్నాయి. చెడు కొలెస్ట్రాల్‌ అధికంగా పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువైపోతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అధిక రక్తపోటు, షుగర్‌ సమస్యలు పెరుగుతాయని అంటున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు ఈ ఆరోగ్యకరమైన డ్రింక్‌ను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఎలాంటి సమస్యల బారిన పడాల్సి ఉండదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలోవెరా జ్యూస్‌తో అద్భుమైన ప్రయోజనాలు: 


సాధారణంగా మనలో చాలా మంది అలోవెరా జ్యూస్‌ను  స్కిన్‌కేర్ కు మాత్రమే ఉపయోగిస్తారు అనుకుంటారు. కానీ అలోవెరా జ్యూస్ చెడు కొలెస్ట్రాల్‌ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ఈ అలోవెరా జ్యూస్‌ చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. 


చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చెందడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అలోవెరా జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు చెడు ఆక్సీకరణను నిరోధించడంలో సహాయపడతాయి. అలోవెరా జ్యూస్ LDL కణాలను తొలగించడంలో సహాయపడే కాలేస్టరాల్‌ను తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
అలాగే మంచి కోలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్‌ను రక్తప్రవాహం నుంచి తొలగించడంలో సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్ మంచి కోలెస్ట్రాల్‌  స్థాయిలను పెంచడంలో కూడా సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.


అలోవెరా జ్యూస్ LDL స్థాయిలను తగ్గించడంలో సమర్థవంతమైనదని చూపించే కొన్ని పరిశోధనలు:


ఒక అధ్యయనంలో, అలోవెరా జ్యూస్ తాగిన వ్యక్తులు 12 వారాల తర్వాత వారి LDL స్థాయిలు 7% తగ్గినట్లు కనుగొన్నారు. మరొక అధ్యయనంలో, అలోవెరా జ్యూస్ తాగిన వ్యక్తులు 8 వారాల తర్వాత వారి LDL స్థాయిలు 10% తగ్గినట్లు కనుగొన్నారు. అలోవెరా జ్యూస్ తాగడానికి ముందు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా మందులు తీసుకుంటున్నట్లయితే, అలోవెరా జ్యూస్ వాటితో సంకర్షణ చెందవచ్చని మీ వైద్యుడితో మాట్లాడండి. లోవెరా జ్యూస్ కొంతమందిలో అతిసారం,కడుపు నొప్పి వంటి దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ర్భవతిగా ఉన్నట్లయితే లేదా పాలిచ్చేటప్పుడు అలోవెరా జ్యూస్ తాగకూడదు.


చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించడానికి ఇతర మార్గాలు:


చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గించడంలో పోషకరమైన ఆహారపదార్థాలు ఏంతో మేలు చేస్తాయి. కూరగాయలు, పండ్లు, తృణధ్యానాలు వంటి పదార్థాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే కాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం దృఢంగా, చురుకుగా తయారు అవుతుంది. దీని వల్ల కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు. ధూమపానం, మద్యపానం తీసుకోవడం వల్ల గుండె సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.


 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి