Turmeric On Face Benefits: మహిళలు చర్మసౌదర్యం, చర్మ సంరక్షన కోసం పసుపును ఉపయోగిస్తారు. అంతేకాకుండా పసుపును భారతీయులు వివిధ వంటకాల్లో కూడా వాడతారు. దీనిని యాంటీబెటిక్‌గా కూడా వినియోగిస్తారు. చాలా మంది చర్మ సమస్యల నుంచి బయటపడటానికి, స్కిన్‌టోన్‌ మెరుగుపడడానికి పసుపును ముఖానికి అప్లై చేస్తున్నారు. కానీ పసుపును చాలా మంది అధిక మోతాదులో చర్మానికి వినియోగించడం వల్ల చర్మ సమస్య తగ్గడమే కాకుండా పెరుగుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పసుపులో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ-ట్యానింగ్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల  మొటిమలు, టానింగ్, సన్‌బర్న్, ముడతలు వంటి చర్మ సమస్యలు తొలగిపోవడానికి సహాయపడుతుంది. పసుపు వల్ల చాలా రకాల ప్రయోజనాలుప్పటికీ దాని ఉపయోగంలో చేసిన కొన్ని తప్పులే చర్మానికి హానికలిగిస్తున్నాయి.  దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి పలు  రకాల చిట్కాలను తెలుసుకుందాం..



ముఖాన్ని బాగా కడుక్కోండి - పసుపు రాసుకున్న తర్వాత ముఖాన్ని సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల ముఖంపై పసుపు అలాగే ఉండిపోతుంది. దీని కారణంగా ముఖం మీద చికాకు వంటి సమస్యలు వస్తున్నాయి. ముఖం నుంచి పసుపు తొలగించిన తర్వాత.. ముఖాన్ని మంచినీటితో శుభ్రంగా కడగండి.



సబ్బుతో కడగకండి - చర్మంపై నుంచి పసుపు తొలగించిన తర్వాత ముఖంపై కొంత పసుపు ఉంటుంది. దీని కారణంగా కొంతమంది మహిళలు సబ్బు లేదా ఫేస్ వాష్ అప్లై చేసి ముఖాన్ని కడుగుతున్నారు. అయితే, ఇలా చేయడం వల్ల చర్మం నల్లగా మారుతుంది.



ఈ పొరపాటు చేయకండి - పసుపు ఫేస్ ప్యాక్ అనేది ముఖంపై మెరుపును తీసుకువచ్చేందుకు సహాయపడుతుంది. కానీ, కొంత మంది మహిళలు మరింత మెరుపును తీసుకురావడానికి పసుపుతో వివిధ పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి హాని కలిగిస్తుంది
 


ఫేస్‌ ప్యాక్‌ - పసుపు ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత, చాలా మంది మహిళలు ఇతర పనుల్లో బిజీగా ఉండి ఫేస్ ప్యాక్‌ను చాలా సమయం ముఖంపై ఉంచుతున్నారు. ఈ ఫేస్ ప్యాక్‌ను ఎక్కువసేపు ఉంచడంతో ముఖంపై పసుపు రంగు మచ్చలు ఏర్పడుతున్నాయి.


Also Read: Skin Care Tips: వేసవిలో ఈ కూరగాయలను ఉపయోగించి ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు!


Also Read: Wood Apple Benefits: మారేడు పండుతో శరీరాని ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook