COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Turmeric Water On Empty Stomach: పసుపు లేని ఆహారాలు తినడం చాలా కష్టం..ఎందుకంటే ఆహారాలు తీసుకునే వారు రుచితో పాటు మంచి కలర్‌ ఉండాలని కోరుకుంటారు. అయితే పసుపు ఆహారాలకు కలర్‌ను అందించడమే కాకుండా పోషకాలను పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల సహాజ పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారాల్లో పసుపును వినియోగించడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే పసుపును ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందట. ఇందులో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ప్రభావంతంగా సహాయపడతాయి.


ఖాళీ కడుపుతో పసుపు మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కర్కుమిన్‌ అనే సహజ సమ్మేళనాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఒక టీ స్పూన్‌ పసుపును గ్లాసు నీటిలో కలుపుకుని ఖాళీ పొట్టతో తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పొట్ట సంబంధిత సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా పొట్ట సమస్యలతో బాధఫడేవారు తప్పకుండా పసుపు నీటిని తాగాల్సి ఉంటుంది. తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ నీటిని తాగొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 


ఇది కూడా చదవండి : Most Highest Selling Car: ఇండియాలో ఇప్పటివరకు ఎక్కువగా అమ్ముడైన కారు ఇదే..


ప్రతి రోజు ఖాళీ పొట్టతో పసుపు నీటిని కలుపుకుని తాగడం వల్ల తీవ్ర వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే కోవిడ్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నీటిని ఉదయంతో పాటు సాయంత్రం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కోవిడ్‌ వల్ల శరీర దెబ్బతినకుండా ఉంటుంది. అంతేకాకుండా సులభంగా శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీని కారణంగా సీజనల్‌ వ్యాధులు రాకుండా కూడా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతి రోజు ఈ నీటిని తాగాల్సి ఉంటుంది. 


 
శరీరంపైవ వాపులు రావడం సర్వ సాధరణం..అయితే వాతావరణంలో తేమ కారణంగా చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిలో చర్మంపై వాపులు, ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు వానా కాలం, చలి కాలం పసుపు నీటిని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు మెదడు పని తీరును కూడా మెరుగు పరుచుతుంది. కాబట్టి తరచుగా జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నీటిని తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా గుండె పని తీరును కూడా మెరుగు పరుచుతుంది. కాబట్టి తీవ్ర గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నీటిని తాగడం అలవాటు చేసుకోండి. 


ఇది కూడా చదవండి : Most Highest Selling Car: ఇండియాలో ఇప్పటివరకు ఎక్కువగా అమ్ముడైన కారు ఇదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి