Black Hair: ఈమధ్య వయసుతో సంబంధం లేకుండా అందరికీ వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి. చిన్నవయసులోనే జుట్టు నెరిసిపోతోంది. చిన్న వయసు నుంచి తమ హెయిర్ నల్లగా కనిపించేందుకు చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హెయిర్ ఫాల్ తర్వాత అందరూ ఎక్కువగా చెప్పే జుట్టు సంబంధిత ప్రాబ్లం తెల్ల వెంట్రుకలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెల్ల వెంట్రుకలు కనిపించకుండా ఉండటానికి చాలామంది కలర్ వేయిస్తూ ఉంటారు కానీ అది ఆరోగ్యానికి కూడా  అంత మంచిది కాదు. మన ఇంట్లోనే తెల్ల వెంట్రుకలు తగ్గడానికి కూడా కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఉండే రెండే రెండు పదార్థాలతో మన జుట్టు నల్లగా, ఆరోగ్యంగా మారిపోతుంది. 


తెల్ల జుట్టు ని తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలు వెతికి వెతికి విసిగిపోయారా? అన్ని రకాల టిప్స్ ఫాలో అయ్యి ఫెయిల్ అయ్యారా? కానీ ఇంట్లో ఉండే రెండు పదార్థాలతో కచ్చితంగా మీ తెల్ల జుట్టు తెల్ల వెంట్రుకలు తగ్గిపోతాయి అవే లవంగాలు, బ్లాక్ టీ.


లవంగాల వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాక జుట్టుకి కూడా ఈ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి లవంగాలలో ఉండే యూజినాల్ అనేది మన జుట్టుని బాగా రిపేర్ చేస్తుంది. ఇంతకుముందు లేని మెరుపుని కూడా తీసుకువస్తుంది


బ్లాక్ టీ కూడా గ్రే హెయిర్ ను తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. తగ్గించడం మాత్రమే కాక బ్లాక్ టీ కి జుట్టుని అందంగా నిగనగాలాడేలా చేసే లక్షణం కూడా ఉంటుంది. కాబట్టి దీనివల్ల మన జుట్టు ఇంకా ఆరోగ్యంగా అందంగా కనిపిస్తుంది.


ఇన్ని ఉపయోగాలు ఉన్న దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ముందుగా రెండు కప్పుల నీరు తీసుకుని అందులో నాలుగైదు లవంగాలు పొడిగా చేసి వేసుకోవాలి. అందులోనే కొంచెం టీ పొడి కూడా వేసుకొని సిమ్లో పెట్టి మరిగించాలి. గిన్నెలో ఉన్న నీళ్లు సగం అయ్యేవరకు మరిగించిన తర్వాత చల్లార్చి వడగట్టాలి.


ఇలా తయారు చేసుకున్న నీటిని డైరెక్ట్ గా జుట్టుకి అప్లై చేసుకోవచ్చు. దానివల్ల జుట్టు నల్లగా పొడుగ్గా పెరగడమే కాకుండా ఎంతో ఆరోగ్యంగా కూడా కనిపిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు. ప్రతిరోజు రాయడం వల్ల దీనికి ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది.


Also Read: KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. 20 మంది 'హస్తం ఎమ్మెల్యేలు' కేసీఆర్‌తో టచ్‌లోకి


Also Read: Cash For Vote: రేవంత్‌ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. చంద్రబాబుతో కుమ్మక్కు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter