Virgin boy egg: మూత్రంలో ఉడికించిన గుడ్లతో వంటకం..తింటే వదలరు...ఎక్కడో తెలుసా?
ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి. ఆ దేశాల్లో ఎన్నో ఆచారాలు, పద్దతులు ఉంటాయి. కొన్ని సర్వసాధారణంగా ఉంటే...మరికొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. ఇలాంటి వింత ఆచారమే ఒకటి చైనాలో ఉంది. సాధారణంగా గుడ్లను ఉడకబెట్టుకొని తింటారు. కానీ చైనాలో మాత్రం...
Virgin boy egg: గుడ్లు తినటం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతారు. సాధారణంగా గుడ్ల(Eggs)ను నీళ్లలో ఉడకబెట్టి తింటాం. కానీ చైనాలో మాత్రం 10 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల నుంచి మూత్రం(Urine) సేకరించి అందులో గుడ్లను ఉడకబెడతారు. ఇదీ నిజం. ఎన్నో శతాబ్దాలుగా అక్కడ ప్రజలు దీనిని పాటిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే...
చైనాలోని జెజియాంగ్‌లోని డాంగ్‌యాంగ్(Dongyang)లో మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లను తింటారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. గుడ్లను ఉండికించడానికి.. 10 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల నుంచి మూత్రం సేకరించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లతో అక్కడివారు ప్రత్యేక వంటకం చేస్తారు. దీనికి Virgin boy egg డిష్ అనే పేరు ఉంది. ఇది ఆ ప్రాంతంలో సంప్రదాయ వంటకంగా ఉంది. దీనిని అక్కడి ప్రజలు ఇష్టంగా తింటారు.
Also Read: Man Swallowed Snake: బతికున్న పామును మింగిన వ్యక్తి.. ఆ తరువాతేం జరిగింది..??
అయితే గుడ్లను ఉడికించడానికి అవసరమైన మూత్రం సేకరించడానికి.. అక్కడ ఫుడ్ స్టాల్ యజమానులు.. స్కూల్స్‌లో బకెట్లు ఉంచుతారు. 10 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను వాటిలో మూత్ర విసర్జన(Urination) చేయమని కోరతారు. ఆ విధంగా సేకరించిన మూత్రాన్ని గుడ్లు ఉడికించడానికి వాడతారు.
సంస్కృతిలో భాగం..
వర్జిన్ బాయ్ ఎగ్ డిష్ తయారు చేయడానికి దాదాపు ఒక పూర్తి రోజు సమయం పడుతుంది. మొదటగా గుడ్లను ఆరు నుంచి ఏడు గంటల పాటు మూత్రంలో ఉంచుతారు. మూత్రంలో గుడ్లను ఉడకబెట్టిన తర్వాత.. వాటి బయటి షెల్ విరిగిపోతుంది. అనంతరం వాటితో డిష్‌ను ప్రిపేర్ చేస్తారు.
అక్కడి ప్రజలు చాలా కాలంగా మూత్రంలో ఉడికించిన గుడ్లను తింటున్నారు. అది వారి సంస్కృతి(Culture) లో భాగంగా మారింది. ఈ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వేడి దెబ్బ తాకదని అక్కడి వారు చెబతున్నారు. ఇది ఆరోగ్యాని(Health)కి చాలా మంచిదని వారు నమ్ముతారు.
ఆరోగ్యకర ప్రయోజనాలు
యూరిన్ థెరపీ(Urine Therphy) అనేది చైనీయులు సాంప్రదాయ వైద్యంలో భాగం. ప్రాచీనకాలంలో మూత్రాన్ని మెడిషన్ గా ఉపయోగించేవారు. నేడు ఇదీ అపరిశుభ్రంగా పిలవబడుతుంది. మూత్రం పోసినప్పుడు కొద్ది సేపటికి ఆరిపోతుంది. అనంతరం ఇది స్పటికీకరిస్తుంది. ఇది వాపు, చర్మం మరియు నోటి ఫంగల్ ఇన్ ఫెక్షన్ లు తగ్గడానికి సహాయపడుతుంది.
మూత్రంలో నానబెట్టిన గుడ్లను తినటం వల్ల బాడీ వేడిని తగ్గించటంతో పాటు రక్తప్రసరణ సరిగా జరిగేలా చూస్తుంది. ప్రాచీన కాలంలో గుడ్లు ఒకరి సొంత మూత్రంలో ఏడు రోజులుపాటు ఉంచి..వాటిని మూడు నెలలపాటు తింటే దీర్ఘకాలిక ఆస్తమాను నివారించవచ్చని చైనీయులు నమ్ముతారు. చిన్నపిల్లవాడి మూత్రం చాలా శక్తివంతమైనదిగా చైనీయులు భావిస్తారు. ఈ మూత్రాన్ని మూలికలతో కలపి టానిక్ తయారు చేస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి