Coconut Milk Hair Mask: కొబ్బరి పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇది మన హెయిర్ కేర్ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు ఊడే సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్స్, మినరల్, ఫ్యాటీ ఆసిడ్స్ జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి. జుట్టుని మాయిశ్చర్ గా ఉంచి కుదుళ్ల ఆరోగ్యానికి తోడ్పడతాయి. కొబ్బరి పాలను జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొబ్బరి పాలు తో జుట్టు పెరుగుదల...
తాజా కొబ్బరి పాలను తీసుకోవాలి దీనికి కొబ్బరికాయను పగల కొట్టి అందులో నుంచి పాలు తీసుకోవాలి. కట్ చేసిన కొబ్బరి ముక్కలను బ్లెండ్ చేసి మొదటగా వచ్చే కొబ్బరి పాలను వడకట్టుకోవాలి. ఒకవేళ మీరు రెడీమేడ్ గా ఉన్న కొబ్బరిపాలను తీసుకుంటే చక్కెర లేనిది తీసుకోండి.


కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్..
కొబ్బరి పాలు అరకప్పు, తేనె ఒక టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఈ మూడిటిని బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. ఓ గంట తర్వాత గోరువెచ్చని నీటితో షాంపూ వేసి తలస్నానం చేసుకోండి.


కొబ్బరి పాలు, కలబంద..
కొబ్బరి పాలు అరకప్పు, కలబంద రెండు టేబుల్ స్పూన్లు
ఈ రెండిటిని బాగా మిక్స్ చేసి జుట్టు అంతటికీ పట్టించి ఓ అరగంట అలాగే ఉంచండి ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేసుకోవాలి.


ఇదీ చదవండి: ఈ 5 ఫుడ్స్‌ తిన్నారంటే బెల్లీఫ్యాట్‌ వెన్నలా కరిగిపోతుందంటే నమ్మండి..


కొబ్బరి పాలు కరివేపాకు నీరు..
కొబ్బరి పాలు అరకప్పు, కరివేపాకు తాజావి తీసుకోవాలి. కరివేపాకును నీళ్లలో మరిగించి తీసి పెట్టుకోవాలి ఈ రెండిటిని మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి ఓ అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.


కొబ్బరి పాలు మెంతుల హెయిర్ మాస్క్..
కొబ్బరి పాలు అరకప్పు మెంతులు రెండు టేబుల్ స్పూన్లు
కొబ్బరి పాలు మెంతుల పొడిని రెండిటినీ మిక్స్ చేసి జుట్టు కుదుళ్లకు అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి ఆరిన తర్వాత జుట్టును కడగండి.


ఇదీ చదవండి: ముఖం పై ట్యాన్ పోవట్లేదా? ఈ ఈజీ హోమ్ రెమిడీ తో చెక్ పెట్టండి..


కొబ్బరిపాలు కండిషనర్..
కొబ్బరి పాలు పావు కప్పు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆర్గాన్ ఆయిల్ వేసి రెండిటిని బాగా మిక్స్ చేసి షాంపూలో వేసి వీటిని అప్లై చేసుకోండి.
కొబ్బరి పాలు నిమ్మరసం..
ఈ రెండిటిని కలిపి కూడా జుట్టుకుదుల నుంచి చివరి వరకు అప్లై చేసి షాంపూతో తల స్నేహం చేసిన మంచి ఫలితాలను అందిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి