Gram Flour Benefits: శనగపిండిలో వీటిని కలిపి ముఖానికి వాడితే.. ఎన్ని లాభాలో తెలుసా..?
ముఖ ఛాయ మెరుగుపరుచుకోటానికి చాలా రకాల ఉత్పత్తులను వాడతారు. వీటికి బదులుగా శనగపిండి వాడితే అన్ని రకాలుగా చర్మానికి మంచి చేసుకురుస్తుంది. శనగ పిండి వలన కలిగే లాభాలు, ఎలా వాడాలో ఇపుడు తెలుసుకుందాం..
Gram Flour Benefits: శనగపిండి చర్మానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే! శనగపిండిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మ సంరక్షణకు దోహదపడుతుందని చర్మ నిపుణుల అధ్యయనాలలో తెలిపింది. ముఖం పై తరచుగా వచ్చే మొటిమలను తగ్గించడంలో శనగపిండి ఉపయోగపడుతుంది. అలాగే పొడిబారిన చర్మాన్ని మృదువుగా తయారుచేస్తుంది. శనగపిండిని ముఖానికి ఎలా వాడాలో మరియు ఎలా ప్రయోజనాలు పొందచ్చో ఇపుడు తెలుసుకుందాం.
జిడ్డును తొలగించే శనగపిండి & పెరుగు
శనగపిండి మరియు పెరుగు అదనపు జిడ్డు ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. శనగపిండిలో పెరుగు కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఈ ప్యాక్ ని ముఖానికి అప్లై చేసి ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.
మొటిమలని తొలగించే శనగపిండి & కీరదోస
శనగపిండిలో కీరదోస పేస్ట్ ని కలిపి పేస్ట్ లా చెయ్యాలి. ఈ ప్యాక్ ని ముఖం నుండి మెడ భాగం వరకు అప్లై చేయండి. 20 నిమిషాల తరువాత శుభ్రపరచుకోవాలి. ఈ ప్యాక్ వల్ల మొటిమలు తగ్గడం తో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది.
Also Read: Revanth Reddy: కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేసినా.. బీఆర్‌ఎస్ ఓటమి ఖాయం: రేవంత్ రెడ్డి
నిర్జీవ చర్మాన్ని తొలగించే శనగపిండి & రోజ్ వాటర్
శనగపిండిలో రోజ్ వాటర్ కలపాలి.. దానితో పాటు కొంచెం పసుపు, ముల్తానీ మిట్టిని కలిపి పేస్ట్ లా చేసి ఆ ప్యాక్ ని ముఖం నుండి మెడ భాగం వరకు అప్లై చేసి.. కాసేపు మర్దన చేసి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ముల్తానీ మిట్టి చర్మానికి చల్లని అనుభూతినిస్తుంది మరియు చర్మంపై ఉండే మలినాలను తొలగించడానికి దోహదపడుతుంది. రోజ్ వాటర్ చర్మ కాంతికి తోడ్పడుతుంది.
పొడిబారిన చర్మాన్ని తొలగించే శనగపిండి & మీగడ
మీగడ, శనగపిండి ప్యాక్ చర్మానికి తేమని అందిస్తుంది. అంతేగాకుండా.. చర్మాన్ని మృదువుగా చేయడంతో పాటు చర్మానికి కాంతినిస్తుంది. శనగపిండి మరియు మీగడని కలిపి పేస్ట్ ల చేయాలి.. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి ఆరనివ్వండి ఆరిన తర్వాత నీటితో కడగండి.
Also Read: Karan Johar: దక్షిణాది సినిమాలపై కరణ్ జోహార్ వివాదాస్పద వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..