Glowing Skin With Green Apple: గ్రీన్ యాపిల్ చూడ్డానికి అందంగా కనిపించడమే కాకుండా ఇందులోనే ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు సౌందర్య పరంగా కూడా ఇందులో ఎన్నో ప్రయోజనాలు మనకు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అందుకే బ్యూటీ ఇండస్ట్రీలో దీన్ని విపరీతంగా ఉపయోగిస్తున్నారు. మరోవైపు ఇది స్కిన్ ఆరోగ్యంగా ఉంచడంతో పాటు దానికి పునరజ్జీవనం అందిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాంటీ ఏజింగ్ గుణాలు..
గ్రీన్ యాపిల్ లో విటమిన్ ఏ, విటమిన్ సి అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది వృద్ధాప్యం త్వరగా కనిపించకుండా చేస్తాయి ఇందులోని న్యూట్రియన్స్ ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. దీంతో ముఖంపై రింకిల్స్ ,ఫైన్ లైన్స్, నల్లమచ్చలు వంటివి కనిపించకుండా నిత్య యవ్వనంగా కనిపిస్తారు.


చర్మ రంగు మెరుగు..
గ్రీన్ యాపిల్ తో హైడ్రేటింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్ రంగును మెరిపిస్తుంది ఇందులో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. గ్రీన్‌ ఫేస్ మాస్క్ లేదా ఫేస్ వాష్ రూపంలో వినియోగించడం వల్ల మన స్కిన్ కి మాయిశ్చర్ అందిస్తుంది. దీంతో ముఖ ఛాయ కూడా మెరుగు పడుతుంది.


పోషకాలు..
గ్రీన్ యాపిల్ లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇది చర్మానికి పోషకాలు అందిస్తాయి. కోల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో స్కిన్ ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది.


చర్మ సమస్యలకు చెక్..
గ్రీన్ యాపిల్‌లో ఫైటో కెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్ కి పోషకం మంచి రక్షణ అందిస్తుంది. స్కిన్ సమస్యలు రాకుండా నివారిస్తుంది. దీన్ని వాడటం వల్ల స్కిన్ సమస్యలు తగ్గిపోవచ్చు.


ఇదీ చదవండి: వాము నీటిని ఇలా తాగితే బరువు ఇట్టే తగ్గిపోతారు..


మచ్చలు..
తరచు గ్రీన్ యాపిల్ తినడం వాటికి సంబంధించిన మాస్క్ ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. ఇది యాంటీ యాక్నే గుణాలు కలిగి ఉంటుంది.


డార్క్ సర్కిల్స్..
గ్రీన్ యాపిల్ ని అప్లై చేయడం లేకపోతే తినడం వల్ల కూడా మన ముఖం కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ ని త్వరగా వదిలించుకోవచ్చు.


గ్రీన్ యాపిల్ మాస్క్ ఇలా తయారు చేసుకోండి..
గ్రీన్ యాపిల్ ని బ్లెండ్ చేసి అందులో తేనె, పెరుగు వేసి కలుపుకొని పేస్ట్ మాదిరి తయారు చేసి ముఖానికి 20 నిమిషాల పాటు అప్లై చేసుకొని ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి.


ఇదీ చదవండి: కలోంజి గింజలు మీ డైట్ లో చేర్చుకుంటే ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..


గ్రీన్ యాపిల్ ,బనానా ఫేస్ మాస్క్..
ఈ ఫేస్ మాస్క్‌ కోసం ముందుగా గ్రీన్ యాపిల్ని పెరుగులో బనానాను బ్లెండ్ చేసి ముఖం మెడ భాగంలో అప్లై చేసి ఆరనివ్వాలి
యాపిల్ పీసెస్ ని కాస్త నీళ్లు పోసి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 15 నిమిషాలు ముఖానికి అప్లై చేసుకుని చల్లనీటితో ఫేస్ వాష్ చేయాలి.


గ్రీన్ యాపిల్ తేనె ఫేస్ మాస్క్ గ్రీన్ యాపిల్ తేనే నిమ్మరసం కలిపి ఫేస్ మాస్ తయారు చేసుకుని 20 నిమిషాలు పాటు మాస్క్ వేసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి