Vankaya Bajji Recipe In Telugu: వంకాయను మనం డిఫరెంట్ డిఫరెంట్ గా కర్రీ లాగా తయారు చేసుకుంటాము. ఎందుకంటే వాటిని ఏ కూరల్లో కలిపి వండుకున్న రుచి మాత్రం పీక్స్..అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో వంకాయలతో బజ్జీలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇక వీటి రుచి గురించి చెప్పనక్కర్లేదు.. వంకాయ బజ్జీలు ఆల్వేస్ సూపర్..ముఖ్యంగా వాతావరణం చల్లబడినప్పుడు వీటిని తింటూ, చాయ్ తాగితే ఆ టేస్టే వేరు. ప్రస్తుతం చాలామంది వంకాయ బజ్జీలను తయారు చేసుకోవడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. ఇకనుంచి వంకాయ బజ్జీలను తయారు చేసుకోవడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు మీ అందించి చిన్న చిన్న పద్ధతులతో టేస్టీ వంకాయ బజ్జీ రెసిపీని తయారు చేసుకోండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వంకాయ బజ్జీలను తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
సన్నగా పొడవుగా ఉండే లేద వంకాయలు తగినన్ని
ఒకటిన్నర కప్పు శెనగపిండి
ముప్పావు కప్పు బియ్యప్పిండి
రెండున్నర టీ స్పూన్ల జీలకర్ర
పావు టీ స్పూన్ పసుపు
డీప్ ఫ్రై కి కావాల్సిన మంచి నూనె


మసాలా పేస్ట్ కి కావలసిన పదార్థాలు:
ఒక కప్పు తరుముకున్న ఉల్లిపాయలు
ఆరు పచ్చిమిర్చిలు
ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర
చింతపండు రెండు టీ స్పూన్లు
తగినంత ఉప్పు
ఒక కప్పు తరుముకున్న కొత్తిమీర
పావు టీ స్పూన్ పసుపు



వంకాయ బజ్జి తయారీ విధానం:
ముందుగా వంకాయ బజ్జీని తయారు చేసుకోవడానికి మసాలా పేస్ట్ ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం పైన పేర్కొన్న మసాలా పేస్ట్ కు సంబంధించిన పదార్థాలు అన్నింటిని మిక్సీ జార్ లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న వేస్ట్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వంకాయ బజ్జీని తయారు చేసుకోవడానికి ప్రాసెస్ ని ప్రారంభించాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా వంకాయలను తీసుకొని వాటికి గాట్లు పెట్టుకొని వేడి నీటిలో వేసి 15 నుంచి 18 నిమిషాల వరకు ఉంచాల్సి ఉంటుంది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఆ తర్వాత వంకాయలను వేడి నీటి నుంచి తీసి మీరు పెట్టుకున్న గాట్లలో ముందుగానే తయారు చేసుకుని సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని నింపాల్సి ఉంటుంది. ఇలా నింపిన తర్వాత వంకాయలను పక్కకు పెట్టుకొని.. ఆ తర్వాత మరో గిన్నెను తీసుకొని శనగపిండి, బియ్యప్పిండి, పసుపు జీలకర్ర, వంట సోడాను వేసి బజ్జీల పిండిలా తయారు చేసుకోవాలి. ఇలా పిండిని బజ్జీల పిండిలా నానబెట్టిన తర్వాత స్టవ్ పై పెద్ద కళాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనెను పోసుకొని మీడియం ఫ్లేమ్ లో ఉంచాల్సి ఉంటుంది.


తర్వాత స్టఫ్ పెట్టుకున్న వంకాయలను పిండిలో ఒక్కొక్కటి ముంచుకుంటూ నూనెలో వేసుకోవాలి. ఈ వంకాయ బజ్జీలను కేవలం మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకుంటూ రంగు మారిన తర్వాత జాలి గంటే  ద్వారా పైనకి తీసి మరోసారి బజ్జీలకు గాట్లు పెట్టి బాగా కాల్చాల్సి ఉంటుంది. ఇలా ఐదు నిమిషాల పాటు బజ్జీలు బాగా రంగు మారిన తర్వాత నూనెలో నుంచి తీసుకుని సర్వ్ చేసుకుని తింటే ఆ రుచి వేరు..


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter