Vellulli Karam Recipe: రుచితో పిచ్చెక్కించే అల్ఇన్ వన్ కారం.. మాములు ఉండదు!
Vellulli Karam Recipe In Telugu: వెల్లుల్లి కారం క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకుంటే బోలెడు లాభాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మీరు కూడా ఇప్పుడు ఇలా తయారు చేసుకోండి.
Vellulli Karam Recipe In Telugu: తెలంగాణ భోజనం అంటే తప్పకుండా వెల్లుల్లి కారం ఉండాల్సిందే.. వెల్లుల్లో ఉండే గుణాలు ఈ కారం ద్వారా శరీరానికి బోలెడు లాభాలను అందిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా వెల్లులి కారం ప్రతి రోజు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇది గొంతు, జలుబు వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారాల్లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ కారాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.
కావలసిన పదార్థాలు:
వెల్లుల్లి రెబ్బలు - 30
నూనె - 2 టీస్పూన్లు
ధనియాలు - 3 స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
ఎండు మిరపకాయలు - 10
జీలకర్ర - 1 స్పూను
తయారీ విధానం:
ముందుగా ఈ కారాన్ని తయారు చేసుకోవడానికి ఒక కళాయి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో నూనెను వేసుకుని బాగా వేడి చేసుకోండి. ఆ తర్వాత ఎండు మిరపకాయలు, ధనియాలు వేసుకుని వేయించుకోవాల్సి ఉంటుంది.
ఇలా అన్ని బాగా వేగిన తర్వాత జీలకర్ర వేసుకుని చిటపటలాడేంత వరకు వేయించాల్సి ఉంటుంది. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
వీటన్నింటినీ ఒక మిక్సీలో వేసుకుని బాగా గ్రైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ కారాన్ని ఓ బౌల్‌లోకి తీసుకోండి.
ఆ తర్వాత ఇలా తయారు చేసుకున్న కారంలో వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేయించాలి. వీటిని ఆ కారంలో కలుపుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇలా అన్ని కలుపుకున్న తర్వాత తయారైన వెల్లుల్లి కారం పొడిని గాలి బరువైన డబ్బాలో నిల్వ చేయాలి.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
చిట్కాలు:
వెల్లుల్లి కారం తయారు చేసేటప్పుడు మిరపకాయల పరిమాణాన్ని పెంచుకోవచ్చు.. తగ్గించుకోవచ్చు.. మీకు ఇష్టమైతే ఎక్కువగా వేసుకోండి.
వెల్లుల్లి రెబ్బలను దంచి కూడా అందులో వేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.
వెల్లుల్లి కారం వేడి అన్నంతో పాటు ఇడ్లీ, దోస వంటి వాటితో కూడా సర్వ్ చేసుకోండి.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.