Modak Recipe: వినాయకుడికి ఎంతో ఇష్టమైన 5 మోదకాల రెసిపీస్ మీ కోసం..
Ganesh Chaturthi Special Modak Recipe In Telugu: వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాల రెసిపీని విభిన్న రుచుల్లో తయారు చేసుకోవచ్చు. ఈ రోజు మేము శరీరానికి ఆరోగ్యాన్ని అందించే రుచికరమైన మోదకాల రెసిపీస్స్ను అందించబోతున్నాం..
Ganesh Chaturthi Special Modak Recipe In Telugu: గణేష్ చతుర్థి పండుగ భారతీయులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజు భక్తులంతా ఎంతో ఆనందంతో స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసి ఉపవాసాలు పాటిస్తారు. భారత్ వ్యాప్తంగా గణపతి ఉత్సవాల పది రోజులలో పాటు సాగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని సమర్పిస్తారు. గణేషుడికి అన్నీ నైవేద్యాలు ప్రీయమైనవే..కానీ కొన్ని నైవేద్యాలంటే ఎంతో ఇష్టమని పురాణాల్లో వివరించారు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో ఒకటి మోదకాలు. వీటిని విభిన్న ఆకారాల్లో తయారు చేస్తారు. గణేషుడి పూజలో తప్పకుండా పెట్టాల్సిన నైవేద్యం ఇదే..అయితే ఈ మోదకాలను ఎలా తయారు చేసుకోవాలో, వీటిని ఏయే రెసిపీల్లో తయారు చేసుకోవచ్చో, మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి, బియ్యంతో మోదకాల రెసిపీ:
కొబ్బరి, బియ్యంతో మోదక్ రెసిపీని సాంప్రదాయ మొదకాలు అని కూడా అంటారు. వీటిని గణపతి పూజలో భాగంగా సమర్పిస్తారు. అయితే వీటిని తయారు చేయడానికి ముందుగా ఒక బాణలిలో నీరు పోసి, కొద్దిగా నెయ్యి , రుచికి ఉప్పు వేసి మరిగించాల్సి ఉంటుంది. బియ్యం పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పిండిని రోటీ పిండిలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తాజాగా తురిమిన కొబ్బరి, బెల్లాన్ని పాన్‌లో వేసి చిన్న మంటపై వేయించుకోవాలి. ఆ తర్వాత పిండిని తీసుకుని అందులోనే తయారు చేసుకున్న కొబ్బరిమి మిశ్రమాన్ని ఫిల్ చేసి మోదకాల ఆకరంలో తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మోదకాలను ఆవిరిపై ఉడికిస్తే రెడీ అయినట్లే..
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
డ్రై ఫ్రూట్ మోదకాలు:
డ్రై ఫ్రూట్స్‌తో చేసిన మోదక్‌లు చాలా రుచిగా ఉంటాయి. ఇవి శరీరానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. చక్కెరకు బదులుగా తీపి కోసం ఖర్జూర మిశ్రమాన్ని వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
శనగపిండి మోదకాలు:
శనగపిండి మోదకాలు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేసే క్రమంలో దేశీ నెయ్యిని వినియోగించి తయారు చేస్తే నోటీకి ఎంతో రుచిగా ఉంటాయి. మీకు కావాలనుకుంటే రుచి కోసం డ్రై ఫ్రూట్స్‌ను కూడా వినియోగించవచ్చు.
తమలపాకు ఫ్లేవర్ మోదకాలు:
ఈ మోదకాలు కూడా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని తయారు చేసే క్రమంలో పచ్చి తమలపాకులను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని చక్కెరకు బదులుగా బెల్లంతో తయారు చేసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook