COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vitamin b12 Deficiency: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధుల కారణంగా చాలామంది సులభంగా ప్రాణాలను కోల్పోతున్నారు. కాబట్టి ప్రతిరోజు పనితో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.. గంటల తరబడి పనులు చేయడం కారణంగా చాలామందిలో బరువు పెరగడం జీర్ణక్రియ సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా మధుమేహం బారిన కూడా పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే కొందరిలో విటమిన్ లోపం కారణంగా కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. 


ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా చాలామందిలో విటమిన్ బి12 లోపం సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దీని కారణంగా చాలా మందిలో నాడీ మండల వ్యవస్థ దెబ్బతిని మానసిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇంకొందరిలో కోపం పెరిగి అలసట,  అజీర్ణం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా విటమిన్ బి 12 లోపం కారణంగా వికారంతోపాటు విరేచనాలు, మలబద్ధకం, పొట్టలో తిరగడం, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 


Also read: Post Office Schemes: రోజుకు 50 రూపాయలు పెట్టుబడి చాలు, 35 లక్షలు సంపాదించే అవకాశం


పెద్దవారితో పాటు పిల్లల్లో కూడా విటమిన్ బి12 లోపం సమస్యలు ఉంటే తప్పకుండా ప్రతిరోజు మూడు పూటలా గోరువెచ్చని పాలను తాగాల్సి ఉంటుంది. ఇలా పాలను ప్రతిరోజు తాగడం వల్ల విటమిన్ బి 12 లోపం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనివల్ల శరీరంలో క్యాల్షియం పరిమాణాలు కూడా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజు పాలను తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.


అంతేకాకుండా శరీరానికి విటమిన్ బి12 అధిక పరిమాణంలో లభించడానికి ప్రతిరోజు పాలతో తయారుచేసిన ఉత్పత్తులను వినియోగించాల్సి ఉంటుంది. ఆహారంలో కోడిగుడ్ల తో పాటు పాలకూరని తీసుకోవడం వల్ల కూడా శరీరానికి విటమిన్ బి 12 లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు అలసట, శరీరం యాక్టివ్ గా లేకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఆహారంలో క్యారెట్ ని కూడా వినియోగించాల్సి ఉంటుంది.


Also read: Post Office Schemes: రోజుకు 50 రూపాయలు పెట్టుబడి చాలు, 35 లక్షలు సంపాదించే అవకాశం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook