Side Effects Of Eating Too Much Watermelon: వేసవి కాలంలో పుచ్చకాయ మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు ఎండ కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలను సులభంగా దూరం చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, లైకోపీన్ వంటి పోషకాలు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఎండా కాలంలో సులభంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా పుచ్చకాయను డైట్‌లో వినియోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో అధిక పరిమాణంలోఫైబర్ లభిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ఈ పండు ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది పుచ్చకాయను విచ్చలవిడిగా తింటున్నారు. ఇలా తినడం వల్ల చాలా శరీరానికి చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండును అతిగా తినడం వల్ల ఎలాంటి శరీరానికి ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!


పుచ్చకాయ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే:


విరేచనాలు:
పుచ్చకాయలో నీరు, ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి అతిగా ఈ పండును తినడం వల్ల అతిసారం, కడుపు ఉబ్బరం, అపానవాయువు, గ్యాస్ మొదలైన జీర్ణ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పుచ్చకాయలో సార్బిటాల్ అనే చక్కెర సమ్మేళనాలు లభిస్తాయి. కాబట్టి వీటిని అతిగా తినడం వల్ల తీవ్ర పొట్ట సమస్యలు వస్తాయి. 


చక్కెర పరిమాణాలు పెరుగుతాయి:
మధుమేహం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు అతిగా పుచ్చకాయలు తినడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలతో పాటు, రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతాయి. కాబట్టి దీని కారణంగా మధుమేహం తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయి. 


కాలేయంలో వాపు సమస్యలు:
అధికంగా ఆల్కాహాల్‌ తీసుకునేవారు అతిగా పుచ్చకాయను తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో లైకోపీన్ ఆల్కహాల్‌ వల్ల కాలేయ సమస్యలకు దారి తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. 


Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook