Weight Loss Tips: ఇటీవలి కాలంలో అధిక బరువు ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. వ్యాయామం చేస్తుంటారు. డైటింగ్ పాటిస్తుంటారు. ఎన్ని చేసినా బరువు మాత్రం తగ్గదు. దీనికి కారణం లేకపోలేదు. కేవలం హెల్తీ ఫుడ్ ఒక్కటే కారణం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. తినే సమయం కూడా ప్రభావం చూపిస్తుందంటారు. అందుకే మీరు క్రమం తప్పకుండా తినే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ సమయంలో ఉండాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధిక బరువు లేదా స్థూలకాయం అనేది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, గుండె వ్యాధులు, కొలెస్ట్రాల్ వంటివి స్థూలకాయం కారణంగా ఉత్పన్నమౌతుంటాయి. వర్క్ ఫ్రం హోం కల్చర్ పెరగడంతో శారీరక శ్రమ లోపించి ఈ సమస్య మరింత పెరిగింది. ముఖ్యంగా కడుపు పెద్దదిగా ఉండి చాలా అసౌకర్యంగా కన్పిస్తుంటారు. చాలామంది వ్యాయమం చేయమనో లేదా హెల్తీ ఫుడ్ తినమనో చెబుతుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ రెండూ సరిపోవు. హెల్తీ ఫుడ్ తినడం ఒక్కటే కాదు..సరైన సమయంలో తీంటున్నామా లేదా అనేది ముఖ్యం. అంటే సమయానికి తినడం చాలా అవసరం. సరైన సమయానికి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ పూర్తయిపోవాలి. అప్పుడే అధిక బరువు నియంత్రణలో ఉంటుంది. సమయపాలన పాటిస్తేనే శరీరం ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంటుంది. 


ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుల ప్రకారం భోజనం చేశాక ఎంతసేపు మీరు యాక్టివ్‌గా ఉంటే అంతసేపూ కేలరీలు కరుగుతుంటాయి. అలా కాకుండా భోజనం చేసిన వెంటనే లేదా కాస్సేపటికే విశ్రాంతి ఉంటే మాత్రం నడుము లేదా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అందుకే భోజనం చేసిన తరువాత కనీసం 3 గంటలు ఆగి నిద్రపోవడం అన్నింటికంటే మంచిది. నిద్రకు చాలా సేపు ముందే భోజన ప్రక్రియ పూర్తయిపోవాలి. ఎందుకంటే నిద్రించడానికి ముందు శరీరం మెలటోనిన్ విడుదల చేస్తుంది. మెలటోనిన్ విడుదలయ్యే సమయానికి భోజనం తినేయాలి. తిన్న వెంటనే నిద్రపోవడం చేస్తే స్థూలకాయం తప్పదు.


అందుకే నిపుణులు కొన్ని వేళలు సూచిస్తున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ 7 గంటలకు పూర్తి చేసేయాలి, గరిష్టంగా అంటే 7.30 గంటలకు పూర్తవాలి. ఇక మద్యాహ్నం భోజనం 12.30 గంటలకు లేదా 1 గంటకు అయిపోవాలి. ఇక రాత్రి భోజనం ఎట్టి పరిస్థితుల్లోనూ 7 గంటలకు పూర్తవాలి. అలా చేస్తేనా 3 గంటల తరువాత నిద్రించినా ఉదయం 6 గంటల వరకూ లేచిపోవచ్చు. అప్పుడే 7-8 గంటల రాత్రి నిద్ర ప్రశాంతంగా ఉంటుంది. 


అంతేకాకుండా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ , మద్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ చేసిన వెంటనే కనీసం 7 నిమిషాలు లైట్ వాక్ ఇంట్లో లేదా పెరట్లో లేదా అటూ ఇటూ తిరగడం అలవాటు చేసుకోవాలి. ఇలా ఈ పద్ధతులు పాటిస్తే కచ్చితంగా స్థూలకాయం తగ్గడమే కాదు ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మీ సొంతమౌతుంది.


Also read: Lotus Health Benefits: తామర పువ్వుల్లో దాగిన ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook