Weight Gain in 8 Days: బరువు తగ్గడమేకాకుండా బరువు పెరగడం అంత సులభం కాదు. అయితే చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడి శరీర ఆకృతిని కోల్పోతున్నారు. అయితే ఇది కూడా ఓ సమస్య కాబట్టి తప్పకుండా దీని నుంచి ఉపశమనం పొందాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది శరీర బరువును పెంచుకోవడానికి చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలను విచ్చలవిడిగా తింటున్నారు. అయితే ఇలాంటి ఆహారాలు అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతుకాకుండా పలు ఆహారాల నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే పలు రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కూడా సులభంగా బరువు పెంచుకోవచ్చు. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకుంటే బరువు పెరుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు పెంచే అద్భుత ఆహారాలు:
నెయ్యి-చక్కెర:

నెయ్యి-చక్కెర ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా సులభంగా బరువు పెరగొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం మీరు ప్రతి రోజూ ఒక చెంచా దేశీ నెయ్యిలో ఒక చెంచా పంచదార కలుపుకుని తినాలి. ఆహారం తినే అరగంట ముందు దీన్ని తింటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు.


ఎండుద్రాక్ష, అంజీర్‌:
ఎండుద్రాక్ష, అంజీర్‌ పండ్లను ప్రతి రోజూ పాలలో కలుపుకుని తాగడం వల్ల కూడా సులభంగా శరీరాన్ని దృఢంగా చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రతి రోజూ 5 ఎండిన అంజీర్‌, 30 గ్రాముల ఎండుద్రాక్షలను రోజూ రాత్రి  పాలలో వేసుకుని తాగితే శరీరం బలంగా తయారవుతుంది.


పాలు, అరటిపండు:
ఉదయాన్నే అల్పాహారంలో ఒక గ్లాసు పాలు, రెండు అరటిపండ్లు తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పాలలో ఉండే క్యాలరీలు శరీర బరువును వేగంగా పెంచుతాయి. అంతేకాకుండా శక్తిని అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.


పాలతో మామిడి పండ్లు:
పాలతో మామిడిపండ్లను తీసుకోవడం వల్ల కూడా సులభంగా బరువు పెరుగొచ్చు. అల్పాహారంలో దీన్ని తినడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: Inter Exams 2023: ఇవాళ్టి నుంచే ఏపీ, తెలంగాణల్లో ఇంటర్ పరీక్షలు


Also read: Shruti Haasan : నెటిజన్ల తిక్క ప్రశ్నలు.. శ్రుతి హాసన్‌ సమాధానాలివే.. ఛీ ఛీ ఇదేం దరిద్రం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook