Weight Lifting: నిర్ణీత పద్ధతిలో వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటే..దీర్ఘాయుష్షు కలుగుతుందట. నమ్మలేకున్నారా..నిజమే ఇది. వారంలో ఒక్కసారి చేసినా సరిపోతుందట. మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీవితంలో యాక్టివ్‌గా ఉండటం, ఎక్సర్‌సైజ్ చేయడం, నియమిత పద్ధతిలో వాకింగ్ చేయడం, యోగా అలవర్చుకోవడం ఇవన్నీ ఆరోగ్యానికి మంచివని చాలా సందర్భాల్లో రుజువైనవే. సైకిల్ తొక్కడం, ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ వంటివి నిర్ణీత పద్దతిలో చేస్తుంటే మీకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. నిర్ణీత పద్ధతిలో ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ఎక్కువ కాలం జీవిస్తారు. అయితే ఇటీవల ఓ కొత్త అధ్యయనం వెలుగుచూసింది. దీని ప్రకారం వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల దీర్ఘాయుష్షు కలుగుతుందట. మీ వయస్సు 50 దాటేసినా ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ ప్రారంభించినా కూడా ఎక్కువ కాలం జీవించే అవకాశాలుంటాయట. ఈ అధ్యయనం ప్రకారం..మరణ ముప్పు తగ్గుతుంది. 


ఇతర ఎక్సర్‌సైజ్‌లానే వెయిట్ లిఫ్టింగ్ చేసేవారికి కూడా దీర్ఘాయుష్షు కలుగుతుందా అనే ప్రశ్నకు ఈ అధ్యయనం సమాధానమిచ్చింది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ఈ స్టడీ వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ స్టడీ ప్రకారం మోడరేట్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తే..త్వరగా మరణించే ముప్పుు తగ్గిపోతుంది. 


మోడరేట్, హెవీ వెయిట్ లిఫ్టింగ్ అంటే ఏమిటి


మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజ్‌లో స్వల్పంగా చెమట్లు పట్టడం, ఊపిరి కొద్దిగా పెరగడం, హార్ట్ బీట్ కొద్దిగా పెరగడం ఉంటుంది. అదే హెవీ వెయిట్ లిఫ్టింగ్‌లో చెమట అధికంగా వస్తుంది. ఊపిరి వేగంగా తీసుకోవడం, హార్ట్ బీట్ అధికంగా ఉండటం జరుగుతుంది. 


మేరీల్యాండ్‌లో‌ని రాక్‌విలేలో ఉన్న నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ పరిశోధకుల బృందం అమెరికాలోని 10 కేన్సర్ సెంటర్లకు చెందిన దాదాపు 1 లక్ష మంది మహిళలు, పురుషుల డేటా విశ్లేషించింది. వీరి వయస్సు 71 ఏళ్లు కాగా బీఎంఐ 27.8 అంటే ఓవర్ వెయిట్ అని తేలింది. వీరిని దాదాపు పదేళ్లు గమనించారు. గుండె సంబంధిత వ్యాధులతో సహా మరణానికి కారణాలపై దృష్టి సారించారు. 


ఇందులోంచి 23 శాతం మంది వెయిట్ లిఫ్టింగ్ చేసేవారు. 16 శాతం మంది నియమిత పద్ధతిలో వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండేవారు. 32 శాతం మంది నిర్ణీత పద్థతి కంటే ఎక్కువగా ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ చేస్తుండేవారు. పరిశోధకుల ప్రకారం వెయిట్ లిఫ్టింగ్, ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ చేసేవారిలో కేన్సర్ తప్ప ఇతర మృత్యుముప్పు తగ్గిందని తేలింది.


యువకుల్లో ఏరోబిక్ యాక్టివిటీ లేకుండా కేవలం వెయిట్ లిఫ్టింగ్ చేసేవారిలో మృత్యువు ముపపు 9-22 శాతం  తగ్గింది. అయితే నిర్ణీత పద్ధతిలో వ్యాయామం చేస్తున్నారా లేదా అనేదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఏదో ఒక విధంగా ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ చేసేవారిలో మృత్యువు ముప్పు 24-34 శాతం తగ్గిపోయింది.


వెయిట్ లిఫ్టింగ్ వల్ల మహిళలకు ఎక్కువగా ప్రయోజనం


వెయిట్ లిఫ్టింగ్, ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ రెండూ చేసేవారిలో కూడా ప్రీమెచ్యూర్ డెత్ రిస్క్ తగ్గిపోయింది. వారంలో కనీసం ఒకసారి లేదా రెండుసార్లు వెయిట్ లిఫ్టింగ్ చేసేవారిలో మృత్యువు ముప్పు 41-47 శాతం తగ్గిపోయిందట. పురుషులతో పోలిస్తే..మహిళల్లో వెయిట్ లిఫ్టింగ్ ప్రయోజనాలు అధికంగా కన్పించాయి.


వెయిట్ లిఫ్టింగ్ కారణంగా మృత్యువు ముప్పు తగ్గుతూ కన్పించింది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. బ్లెడ్ ప్రెషర్, బ్లడ్ లిపిడ్ ప్రొపైల్ అంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరాయిడ్స్ నియంత్రణలో ఉంటాయి. అందుకే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గిపోతుంది. 


Also read: Skin Care Tips: ముఖంపై ముడతలు దూరం కావాలంటే ఆ మూడు ఫుడ్స్ దూరం కావల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook