Weight Loss Food: ఈ ఆహార పదార్థాలను తినడం అలవాటు చేసుకుంటే సులభంగా 15 రోజుల్లో బరువు తగ్గొచ్చా..?
Weight Loss Food: బరువు తగ్గడం కష్టమైన పని అయినప్పటికి సులభంగా తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందు కోసం ఆరోగ్య నిపుణులు సూచించి ఈ ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Weight Loss Food: బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. ఫిట్‌గా ఉండాలంటే సరైన మోతాదులో ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. శరీరంలో తగిన మోతాదులో ఫైబర్ లేకపోవడం వల్ల బరువు పెరుగుతున్నరని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అధిక ఫైబర్ ఆహారాలు నెమ్మదిగా జీర్ణమవుతాయి. అయితే బరువు నియంత్రించుకోవడం శరీరానికి చాలా మంచిది కాబట్టి తప్పకుండా పలు రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండే ఆహారాల్లో ఈ కింద పేర్కొన్న వాటిని తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.
ఈ ఆహారాలను తప్పకుండా ఆహారంలో తీసుకోండి:
>>బరువు తగ్గడానికి తక్కువ కార్బోహైడ్రెట్స్‌ను ఉన్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మీరు బ్లాక్బెర్రీస్, రాస్ప్బెర్రీస్, స్ట్రాబెర్రీలు మొదలైనవి పండ్లను తినాల్సి ఉంటుంది. బెర్రీస్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.
>>చియా గింజలు కూడా బరువు తగ్గడానికి ప్రభావవంతంగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిల్లో పీచు స్థాయి ఎక్కువగా, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. చియా విత్తనాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి కీలక పాత్ర పోషిస్తాయి.
>>గోధుమ రవ్వలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి ఈ రవ్వతో చేసిన ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని రోటిల్లా కూడా చేసుకుని ఆహారంలో తీసుకోవచ్చు. ఇలా చేసుకుని తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.
>>బ్రోకలీలో అన్ని కూరగాల కంటే అధిక పరిమాణంలో పోషకాలు, ఫైబర్ ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు రెండూ తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గే క్రమంలో వీటిని తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని అతిగా తీసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు.
Also Read: అప్పటి నుంచి ఏమీ లేదు.. ఎవర్ని ఎక్కడ పెట్టాలో ఎన్టీఆర్ కు తెలుసంటున్న డైరెక్టర్!
Also Read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook