Weight Loss Drink: ఈ కషాయాలు తాగితే 5 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..!
Weight Loss In 5 Days: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కావున ఆరోగ్యమైన, ప్రోటిన్లు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. అయితే తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
Weight Loss In 5 Days: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కావున ఆరోగ్యమైన, ప్రోటిన్లు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. అయితే తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చాలా మందిలో అనారోగ్యకరమైన, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల బరువు పెరగడం, మధుమేహం సమస్యలకు గురయ్యే అవకాశాలున్నాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. పసుపు, నిమ్మరసం, అల్లం నీరు తాగడం వల్ల శరీరానికి ప్రయోజనాలు లభించడమేకాకుండా.. ఈ సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
పసుపు, నిమ్మ, అల్లం నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
శరీర రోగ నిరోధక శక్తిని పటిష్టంగా చేసేందుకు ప్రభావవంతంగా పని చేస్తుంది. క్రమం తప్పకుండా పసుపు, నిమ్మ, అల్లం నీటి తాగడఊం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి అధిక పరిమాణంలో ఉంటుంది కావున శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
మూత్రపిండాలకు మేలు చేస్తుంది:
పసుపు, నిమ్మ, అల్లం నీరు కాలేయం, మూత్రపిండాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటితో తయారు చేసిన కషాయాలను తీసుకోండి.
బరువు తగ్గడం:
పసుపు, నిమ్మ, అల్లం కషాయాలు రోజూ తాగడం వల్ల బరువును నియంత్రిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కృషి చేస్తాయి.
ఈ కషాయాలను ఎలా తయారు చేసుకోవాలి:
అల్లం, పసుపు, నిమ్మకాయ కషాయాలను సిద్ధం చేసుకోవడానికి.. ముందుగా ఒక గ్లాసులో నీరు తీసుకుని.. అందులో అల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. అది ఉడికిన తర్వాత ఒక టీస్పూన్ నిమ్మరసం, అర టీస్పూన్ పసుపు పొడి వేసి.. చల్లారాక టీ, కాఫీలా తాగండి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ఆమోదించదు.)
Also Read: Radhana Ram: ఇండస్ట్రీకి మరో వారసురాలు..ఏకంగా పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook