Weight loss Precautions: స్థూలకాయం ప్రధాన సమస్య. అంతకంటే ముఖ్యమైన సమస్య బరువు నియంత్రణ. చాలా సందర్భాల్లో బరువు తగ్గినా..నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎలాంటి తప్పులు చేస్తే ఈ పరిస్థితి వస్తుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గడం ఎంత కష్టమో..తగ్గించుకున్న బరువును నియంత్రించడం అంటే తిరిగి పెరగకుండా చూసుకోవడం అంతకంటే కష్టం. ఎందుకంటే సాధారణంగా బరువు తగ్గేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసి..కొద్దిగా బరువు తగ్గుతున్నారనగా..రిలాక్స్ అవుతారు. ఫలితంగా మళ్లీ బరువు పెరిగిపోతారు. ఒకసారి బరువు తగ్గిన తరువాత తిరిగి పెరగడమనేది చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. మనం చేసే కొన్ని తప్పులే ఇందుకు కారణాలు. ఏయే తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..


సాధారణంగా చాలామంది కాస్త బరువు తగ్గగానే లేదా..అనుకున్న బరువు తగ్గిన తరువాతైనా సరే పాత అలవాట్లను మళ్లీ అవలంభిస్తుంటారు. ఇదే అతి పెద్ద తప్పు. ఒకసారి బరువు తగ్గిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాత అలవాట్లు చేసుకోకూడదు. ఎందుకంటే బరువు పెరగడానికి ఆ అలవాట్లే కారణం. మరి కొంతమంది దీర్ఘకాలం డైటింగ్ చేసి చేసి..బరువు తగ్గుతారు. ఫలితంగా ఆకలి పెరుగుతుంటుంది. దాంతో బరువు తగ్గాం కదా అని కాస్త రిలాక్స్ అయి..ఏవి పడితే అవి తినేస్తుంటారు. ఇలా చేయడం వల్ల గతం కంటే ఎక్కువ బరువు పెరిగే అవకాశాలున్నాయి. 


బరువు అనేది ఎప్పుడూ మెయింటైన్ చేయాలి. దీనికోసం శరీరాన్ని యాక్టివ్‌గా పనులు చేయిస్తూ ఉండాలి. ఒకసారి బరువు తగ్గిన తరువాత ఎక్సర్‌సైజ్‌లు మానేయడం వంటివి అస్సలు చేయకూడదు. బరువు తగ్గిన తరువాత ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అంతే స్థాయిలో లేదా అంతకంటే వేగంగా బరువు పెరిగే ప్రమాదముంది. 


Also read: Hair Care Tips: మీ కేశాలు మృదువుగా, నిగనిగలాడాలంటే..ఇలా చేయండి చాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook