Weight Loss Tips in 15 Days: ఆధునిక పోటీ ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రధానంగా కన్పించే సమస్య అధిక బరువు. బరువు తగ్గించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ జీలకర్రతో అద్భుతంగా బరువు తగ్గించవచ్చని చాలా తక్కువమందికి తెలుసు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతీయుల ప్రతి కిచెన్‌లో తప్పకుండా ఉంటుంది జీలకర్. ఆహార పదార్ధాల రుచి పెంచేందుకు జీలకర్ర వినియోగించడం అలవాటే. అయితే జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇందులో ఉండే మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, విటమిన్లు, ఫైబర్, పొటాషియం ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్నించి ఉపశమనం కల్గిస్తాయి. జీలకర్ర తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది అధిక బరువు సమస్య. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వే వైద్య నిపుణులు. జీలకర్రతో బరువు ఎలా తగ్గించుకోవచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం..


జీలకర్ర-కరివేపాకు నీళ్లు


జీలకర్ర, కరివేపాకు నీళ్లతో బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. దీనికోసం రాత్రి నిద్రపోయేముందు ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి. ఉదయం ఈ నీటిని కాచి తాగాలి. ఈ మిశ్రమాన్ని రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరం మెటబోలిజం వృద్ధి చెందుతుంది. దాంతోపాటు బరువు గణనీయంగా తగ్గుతారు. 


జీలకర్ర-ధనియా నీళ్లు


జీలకర్ర, ధనియాలు రెండింటితోనూ అధిక బరువు తగ్గించుకోవచ్చు. బరువు తగ్గేందుకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ధనియా-జీలకర్ర నీళ్లను తాగాల్సి ఉంటుంది. రాత్రి కొద్దిగా జీలకర్ర, ధనియాలను నీళ్లలో వేసి ఉంచాలి. ఉదయం ఆ నీళ్లను పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. 


జీలకర్ర నిమ్మకాయ నీళ్లు


నిమ్మకాయతో కూడా బరువు తగ్గించుకోవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. దీనికోసం రాత్రి పూట రెండు స్పూన్ల జీలకర్రను గ్లాసు నీటిలో వేసి ఉంచాలి. ఉదయం ఈ నీటిని వడపోసి..కొద్దిగా నిమ్మకాయ పిండుకుని తీసుకోవాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అధిక బరువు సమస్య నుంచి గట్టెక్కేందుకు జీలకర్రతో ఈ మూడు విదానాలు మంచి ఫలితాలనిస్తాయి.


Also read; Belly Fat Reduce: పొట్ట చుట్టూ కొవ్వుతో బాధపడుతున్నారా.. ఈ డికాషన్ తీసుకోండి..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook