Weight loss Tips: ఈ నీళ్లు క్రమం తప్పకుండా రోజూ తాగితే నెలరోజుల్లోనే అధిక బరువుకు చెక్
Weight loss Tips: ఆధునిక జీవనశైలిలో అధిక బరువు అతి పెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గించేందుకు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి, బరువు ఎలా తగ్గించుకోవాలి..ఆ వివరాలు మీ కోసం.
Weight loss Tips: ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా అధిక బరువు లేదా స్థూలకాయం సమస్యగా మారిపోయింది. వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడమే ఇందుకు కారణం. ప్రతి ఒక్కరికీ ఈ సమస్య నుంచి విముక్తి పొందాలనే ఉంటుంది. కానీ సరైన మార్గమే కన్పించదు.
అధిక బరువు ఆరోగ్యానికి మంచిది కాదు. స్థూలకాయం కారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. స్థూలకాయం సమస్య నుంచి గట్టెక్కడం చాలా అవసరం కూడా. బరువు తగ్గించే క్రమంలో చాలా మంది గంటల తరబడీ జిమ్‌లో గడుపుతుంటారు. అయినా ఆశించిన ప్రయోజనముండదు. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తూ తగిన వ్యాయామం చేస్తే చాలు సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. మెంతి నీరు బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుందంటున్నారు డైటిషియన్లు.
అధిక బరువు అందరికీ సమస్యే. ఈ సమస్యను వేగంగా తగ్గించుకునేందుకు ప్రకృతిలో చాలా పదార్ధాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి మెంతులు. బరువు తగ్గించేందుకు మెంతుల్ని పౌడర్‌గా చేసుకుని ఉంచుకోవాలి. రోజూ ఉదయం పరగడుపున ఒక స్పూన్ మెంతి పౌడర్‌లో కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి. రోజుకు రెండుసార్లు చేస్తే ఇంకా మంచి ఫలితాలుంటాయి. ఇలా చేయడం వల్ల బరువు వేగంగా నియంత్రణలో వచ్చేస్తుంది. మెంతులు, తేనె కాంబినేషన్‌తో బరువు వేగంగా తగ్గడమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పటిష్టమౌతుంది.
స్థూలకాయం సమస్య నుంచి విముక్తి పొందేందుకు మరో విధానం ఉంది. బరువు తగ్గించేందుకు మెంతి నీరు చాలా అద్బుతంగా ఉపయోగపడనున్నాయి. రాత్రి పూట ఒక స్పూన్ మెంతుల్ని నానబెట్టుకోవాలి. ఉదయం పరగడుపున నానబెట్టిన నీటిని అదే నీటిలో క్రష్ చేసి మెంతులతో సహా తాగాలి. దీనివల్ల శరీరం వేగంగా డీటాక్స్ అవుతుంది. బరువు కూడా తగ్గుతుంది. బరువు తగ్గించేందుకు ఇదే అద్భుతమైన చిట్కా.
మెంతులతో టీ కూడా స్థూలకాయం సమస్యను నిర్మూలించేందుకు ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీళ్లను ఉడికింది. అందులో ఒక స్పూన్ మెంతులు వేసి నీళ్లు సగమయ్యేవరకూ ఉడికించాలి. ఆ తరువాత ఈ నీళ్లను వడకాచి తాగాలి. రోజూ పరగడుపున ఇలా తాగితే చాలా వేగంగా బరువు తగ్గిపోతుంది. ఇక్కడ ఉదహరించిన మూడు విధానాల్లో ఏ విధానం పాటించినా బరువు తగ్గడమే కాకుండా..కొలెస్ట్రాల్, డయాబెటిస్ నియంత్రణకు సైతం అద్భుతంగా ఉపయోగపడుతుంది.
Also read: Weight Loss Diet: ప్రతి రోజు ఈ డైట్ పద్ధతిలో ఆహారాలు తీసుకుంటే కేవలం 7 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook