Weight Loss Tips: మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి. ఆహారంలో నియంత్రణ పాటించినా, వ్యాయామం లేదా వాకింగ్ చేస్తున్నా ఫలితం కన్పించడం లేదంటే కారణం జీవనశైలిలో మార్పు రాకపోవడమే. అంటే అధిక బరువు లేదా స్థూలకాయం సమస్యకు ప్రధాన కారణం జీవనశైలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధిక బరువు అనేది ప్రస్తుతం పెను సమస్యగా మారిపోయింది. బిజీ లైఫ్, చెడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం ఇలా చాలా కారణాలు మనిషి బరువును అమాంతం పెంచేస్తున్నాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నియంత్రించలేని నిస్సహాయ పరిస్థితి ఉంటోంది. వాకింగ్, వ్యాయామం, డైటింగ్ ఇలా తలో పద్ధతిని అనుసరించినా ఫలితం ఉండదు. అయితే బరువు తగ్గించడం చాలా అవసరం. ఎందుకంటే అధిక బరువు కారణంగా కొలెస్ట్రాల్, రక్తపోటు, డయాబెటిస్, గుండె పోటు వంటి వ్యాధులు ముప్పు పెరుగుతుంది. ఇవి ప్రమాదకర వ్యాధులు కావడంతో తక్షణం బరువు తగ్గించాల్సిన అవసరముంది.


చాలా మంది నిపుణులు చెప్పిందాని ప్రకారం అధిక బరువు సమస్యకు చెక్ చెప్పాలంటే ముందు జీవనశైలిలో మార్పు తీసుకురావాలి. దీనికోసం రోజూ లేవగానే ఈ ఐదు పనులు చేస్తే చాలు.


ప్రతిరోజూ ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాసు వేడి నీళ్లు తాగడం చాలా మంచిది. ఇందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుంటే మరీ మంచిది. రోజూ వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని విష పదార్ధాలను బయటకు పంపించి జీర్ణక్రియ మెరుగుపడేందుకు దోహదపడుతుంది. 


రోజూ లేవగానే యోగా చేయడం వల్ల బరువు నియంత్రించవచ్చు. రోజూ క్రమం తప్పకుండా యోగాసనం వేయడం వల్ల బరువు కచ్చితంగా తగ్గుతారు. రోజుకు అరగంట యోగా చేస్తే 270-280 కేలరీలు బర్న్ అవుతాయని అంచనా.  ప్రోటీన్లు ఎక్కువగా ఉండే అల్పాహారం తీసుకుంటే రోజంతా ఫ్రెష్‌గా, శక్తివంతంగా మారుతారు. ప్రోటీన్లు అధికంగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ కోసం గుడ్లు, స్ప్రౌట్స్ తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. 


అన్నింటికంటే ముఖ్యమైంది రోజూ రాత్రి వేళ త్వరగా నిద్రపోవాలి. అంటే ఎర్లీ టు బెడ్ , ఎర్లీ టు రైజ్ చాలా అవసరం. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. దీనివల్ల శరీరం పునరుత్పత్తికి, రీఛార్జ్‌కు ఉపయోగపడుతుంది. నిద్ర తక్కువైతే శరీరానికి ఇంధనం కోసం ఎక్కువ ఆహారం తీసుకుంటాం. ఫలితంగా బరువు పెరగడం ప్రారంభమౌతుంది. అందుకే రోజుకు 7-8 గంటల నిద్ర తప్పనిసరి.


రోజూ లేవగానే ఉదయం 7-8 గంటల ప్రాంతంలో సూర్య రశ్మి శరీరంపై పడేట్టు చూసుకోవాలి. సూర్య కాంతి నేరుగా చర్మంపై పడినప్పుడు కూడా చర్మం దిగువన ఉండే కొవ్వు చాలావరకూ కరుగుతుంది. 


Also read: Health Care: ఈ రోజూ నమిలి తింటే మలబద్ధకం, మధుమేహం అన్నీ మాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook