Chicken and Paneer for Weight Loss.. which one is Better.. ?: చికెన్, పన్నీర్ రెండింట్లోనూ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రెండూ కండరాల నిర్మాణం, మరమ్మత్తులకు ఉపయోగపడతాయి. మరి ఈ రెండింట్లో బరువు తగ్గించేందుకు ఏది మంచిదనేది పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గించేందుకు చికెన్ లేదా పన్నీర్ రెండింట్లో ఏది బెటర్ అనే విషయంలో చాలా మందికి సందేహాలుంటాయి. ఎందుకంటే రెండింట్లోనూ ప్రోటీన్లు ఎక్కువ. రెండూ కండరాల నిర్మాణంలో దోహదపడతాయి. అయితే రెండింటికీ మధ్య కొద్దిగా తేడా ఉంది. బరువు తగ్గించేందుకు ఏదెక్కువ ప్రయోజనకరమో తెలుసుకోవాలి. 


చికెన్ అనేది ఒక లీన్ ప్రోటీన్. ఇందులో కేలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉంటాయి. ఇందులో  ఎమైనో ఆసిడ్స్ అధికంగా ఉండటం వల్ల కండరాల నిర్మామం, మరమ్మత్తులకు అవసరం. చికెన్ అనేది విటమిన్ బి12కు మంచి సోర్స్. పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి12 అనేది శరీరానికి శక్తిని స్థిరంగా ఉంచేందుకు నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది. మరోవైపు పన్నీర్ అనేది ప్రతి భారతీయుడి వంటల్లో వినియోగించే పదార్ధం. ఇందులో కూడా ప్రోటీన్లతో పాటు కేలరీలు, ఫ్యాట్ ఉంటాయి. పన్నీరులో అదనంగా కాల్షియం ఉంటుంది. ఎముకలకు బలాన్నిస్తుంది.,


బరువు తగ్గించేందుకు ఏది ఉపయోగ..?


దీనికి మరో సమాధానం లేదు. చికెన్ ఒక్కటే మంచి ప్రత్యామ్నాయం. ఇందులో కేలరీలు, ఫ్యాట్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అవసరానికి మించి కేలరీలు తీసుకుంటే బరువు పెరుగుతారు. చికెన్ లీన్ ప్రోటీన్ అయినందున కేలలీలు, ఫ్యాట్ తక్కువ మోతాదులో ఉంటాయి. దీనికితోడు అదనంగా ఎమైనా ఆసిడ్స్ ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణంలో ఉపయోగపడతాయి. మెటబోలిజంను వేగవంతం చేసి బరువు తగ్గించేందుకు దోహదం చేస్తాయి.


వాస్తవానికి చికెన్, పన్నీరు రెండూ బరువు తగ్గించేందుకు డైట్‌లో చేర్చుకోవచ్చు. అయితే వీటిని వండే విధానం మాత్రం ఆరోగ్యకరంగా ఉండేట్టు చూసుకోవాలి. అంటే ఫ్రై కాకుండా గ్రిల్ లేదా బేకింగ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి. మీరు ఒకవేళ శాకాహారులైతే బరువు తగ్గించేందుకు పన్నీర్ డైట్‌లో చేర్చుకోవల్సి ఉంటుంది. 


Also Read: Weight Loss Tips: ఆ నీళ్లు రోజూ పరగడుపున తీసుకుంటే..కేవలం వారం రోజుల్లోనే అధిక బరువుకు చెక్


Also Read: Loan Recovery Rules: లోన్ చెల్లించలేకపోతున్నారా..? రికవరీ ఏజెంట్లు బెదిరిస్తే ఇలా చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook