Fast Weight Gain Fruits: జీవనశైలి జరుగుతున్న మార్పుల కారణంగా చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు బరువు పెరగడమేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు పెరుగుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి ప్రస్తుతం చాలా మంది డైట్‌లను వినియోగిస్తున్నారు. వీటిల్లో చాలా వరకు పండ్లతో తయారు చేసిన పదార్థాలే ఉంటున్నాయి. ఇందులో కొన్ని శరీర బరువును పెంచడమేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే బరువు తగ్గే వారు ఎలాంటి పండ్లను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం


బరువు తగ్గేవారు ఈ పండ్లను తినకూడదు:
వేసవిలో అరటిపండ్లను ప్రతి రోజు తినడం వల్ల కూడా సులభంగా శరీర బరువు పెరుగుతారు. కాబట్టి వేసవి కాలంలో బనానా షేక్ తాగకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అరటిపండ్లలో చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల బరువు పెరిగే ఛాన్స్‌ ఉంది. 


మామిడి పండ్లను ప్రతి రోజు తినడం వల్ల కూడా శరీర బరువు పేరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా మామిడి పండ్లను తినొద్దు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో వేడిని కూడా పెంచుతాయి. 


సమ్మర్‌లో ఫుల్ క్రీమ్ మిల్క్ తాగడం కూడా చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అతిగా ఈ క్రీమ్ మిల్క్‌ను తాగకపోవడం చాలా మంచిది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు కూడా పెరుగుతారు. 


బంగాళాదుంపను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే వీటిని తినడం కారణంగా కూడా శరీర బరువు పెరిగే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు డైట్‌లో బంగాళాదుంపలో వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది.


బరువు తగ్గేవారు వేసవిలో డ్రై ఫ్రూట్స్ కూడా తినొద్దని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు డ్రై ఫ్రూట్స్‌ను నీటిలో నానబెట్టి తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook