Weight Loss with Litchi: లిచీ తీయ్యగా ఉంటుంది. బయట గులాబీ రంగులో ఉండే ఈ పండు లోపలవైపు తెలుపు రంగులో ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉండే ఈ లిచీ పండుతో బరువు కూడా తగ్గవచ్చు. లిచీలో డైటరీ ఫైబర్ పుఫ్కలంగా ఉంటుంది. అంతేకాదు లిచీపండులో తక్కువ కేలరీలు ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం లిచీలో ఉండే డైటరీ ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మంచి పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు లిచీని డైట్లో చేర్చుకోవాలి. వీటిని సలాడ్‌ రూపంలో తీసుకోవచ్చు, స్మూథీ తయారు చేసుకోవచ్చు. ఈ ఎండకాలంలో కూడా లిచీపండును కచ్చితంగా మీ డైట్లో చేర్చుకోండి. ఇందులో పోషకాలతో పాటు బరువు కూడా తగ్గిపోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యాలరీలు తక్కువ..
లిచీలో క్యాలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. మీకు స్వీట్‌ తినాలనే కోరిక తగ్గిపోతుంది.  బరువు కూడా తగ్గిపోతారు. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. దీంతో మీరు ఎక్కువ క్యాలరీలు ఉన్న స్వీట్లను తినకుండా ఉంటారు. బరువు తగ్గాలునకునే వారికి ఇది ఓ మంచి ఎంపిక.


ఇదీ చదవండి: మీ వంటల్లో ఈ ఆయిల్ వాడుతున్నారా? తస్మాత్‌ జాగ్రత్త.. మీకు గుండెపోటు వచ్చే అవకాశం..


ఫైబర్..
లిచీ పండులో డైటరీ ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది.  అంతేకాదు ఇది తిన్నాక ఎక్కువ సమయంపాటు మీ కడపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. దీంతో ఆహారం తక్కువ మోతాదులో తీసుకుంటారు. బరువు పెరగకుండా ఉండొచ్చు. లిచీ పండులో ఫైబర్‌ పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య కూడా రాకుండా చేస్తుంది. ఈ పండును పిల్లలు పెద్దలు అందరూ ఆస్వాదించవచ్చు.


మెటబాలిజం..
లిచీలో విటమిన్‌ బీ, బీ6, బీ3 పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో అధిక క్యాలరీలు బర్న్‌ చేస్తుంది. ఈవిధంగా లిచీ మనం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. లిచీని తరచూ తినడం వల్ల బరువు కూడా తగ్గిపోతారు.


ఇదీ చదవండి: మీ జుట్టు స్పీడ్‌గా.. ఒత్తుగా పెరగాలంటే ఈ రసం రాయండి చాలు..
హైడ్రేషన్..
లిచీలో సహజసిద్ధమైన నీటి శాతం అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన హైడ్రేషన్‌తో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. మన శరీర పనితీరుకు కూడా సహాయపడుతుంది. అందుకే ఈ ఎండకాలం లిచీలను మీ డైట్లో చేర్చుకుంటే శరీరం అంతటికీ రోజంతటికీ కావాల్సిన నీరు మన శరీరానికి అందుతుంది.


పుష్కల ఖనిజాలు..
లిచీలో విటమిన్‌స సీ, బీ6, పొటాషియ పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీ ఇమ్యూనిటీ స్థాయిలను పెంచుతాయి, అంతేకాదు ఈ లిచీ తింటూ బరువు పెరగకుండా ఉంటాయి. లిచీ పండులో మన శరీరానికి అవసరమైన విటమిన్స్‌తోపాటు ఖనిజాలు కూడా ఉంటాయి. మన శరీర పనితీరుకు ఇవి ఎంతో అవశ్యకం.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter