Jeera and Saunf Water: స్థూలకాయం తగ్గించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ జీలకర్ర, సోంపు నీళ్లతో ఐస్‌క్యూబ్ కరిగినట్టుగా బరువు కరిగిపోతుందట..ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గించేందుకు ఎన్నోరకాల ప్రయత్నాలున్నాయి. కొన్ని సఫలమైతే..మరికొన్ని విఫలమౌతుంటాయి. ఈ క్రమంలో నేచురల్ డీటాక్స్ జ్యూస్‌తో అద్భుత ఫలితాలు సాధించవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. నేచురల్ డీటాక్స్ జ్యూస్‌ను తయారీ కూడా చాలా సులభం. కేవలం సోంపు, జీలకర్రతో చేస్తారు. వీటి లాభాలేంటనేది తెలుసుకుందాం..


ప్రస్తుతం అందరికీ ప్రధానంగా వేధించే సమస్య స్థూలకాయం లేదా అధిక బరువు. అందుకే బరువు తగ్గించుకునేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరు ఏం చెప్పినా ఫోలో అవుతుంటారు. అయితే నేచురల్ డీటాక్స్ జ్యూస్‌తో మీ బరువును సులభంగా తగ్గించుకోవచ్చని మీకు తెలుసా. మీ డైట్ సరిగ్గా ఉంటే స్థూలకాయం తగ్గించడం సులభమే. బరువు తగ్గేందుకు, హ్యాండ్సమ్, స్లిమ్ అండ్ ట్రిమ్‌గా మారేందుకు గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్లు చేయాల్సిన అవసరం లేదు. కేవలం జీలకర్ర, సోంపు నీళ్లు తాగితే చాలు. ఇదొక అద్భుతమైన డీటాక్స్ జ్యూస్. పూర్తిగా సహజసిద్దమైంది. ఇది సేవించడం ద్వారా బరువు గణనీయంగా తగ్గించుకోవచ్చు.


శరీరంలో మెటబాలిజం అనేది చాలా ముఖ్యం. ఇది సరిగ్గా ఉంటే ఏ విధమైన అనారోగ్య సమస్య తలెత్తదు. మెటబాలిజం సరిగ్గా లేకపోతేనే బరువు పెరగడం, తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే మెటబాలిజం ద్వారా కేలరీలు వేగంగా తగ్గుతాయి. సరైన భోజనం, బ్రేక్‌ఫాస్ట్ చేస్తే మెటబాలిజం స్థిరంగా ఉంటుంది. రోజూ జీలకర్ర, సోంపు నీళ్లు తాగడం వల్ల కేలరీలు వేగంగా కరుగుతాయి. దాంతోపాటు జిమ్, సైక్లింగ్, వాకింగ్ చేస్తే అదనపు ప్రయోజనాలు కలుగుతాయి.


జీర్ణక్రియ బాగుందంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు అర్ధం. బరువు తగ్గించాలంటే పరిమితమైన ఆహారం తినడం, జీర్ణక్రియను మెరుగుపర్చడం చాలా అవసరం. పరిమితమైన భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. ఫలితంగా రక్త ప్రసరణ అన్నీ సవ్యంగా జరుగుతాయి. స్థూలకాయం నియంత్రణలో ఉంటుంది. జీలకర్ర, సోంపు నీళ్లు తాగడం ద్వారా మెటబాలిజం వృద్ధి చెందుతుంది.


ఉదయం వేళ సహజసిద్ధమైన పండ్ల జ్యూస్ తాగడం అవసరం. ఎందుకంటే అవసరానికి మించి భోజనం చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఫలితంగా శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోయి..స్థూలకాయానికి దారితీస్తుంది. క్రమంగా ఒక్కొక్క రోగం చుట్టుముడుతుంది. 


Also read: Honey Benefits: తేనెను రోజూ ఇలా సేవిస్తే చాలు..5 వారాల్లో 10 కిలోలు తగ్గడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook