Eating Expired Food: గడువు తీరిన ఆహారం తింటే శరీరానికి ఏమవుతుంది?
What Happens If You Eat Expired Food: మనం సాధారణంగా మార్కెట్లో కొనుగోలు చేసే వస్తువుల మీద గడువు కూడి ఉంటుంది. దీని ఇచ్చని గడుపు ప్రకారం మనం ఉపయోగిస్తాము. ప్యాక్ చేసిన ఆహారాలు ఎంత నష్టాన్ని కలిగిస్తాయో మన అందరికి తెలుసు. అయితే గడువు తీరిన ఆహారం తీసుకోవడం శరీరానికి ఎలాంటి నష్టం కలుగుతుంది అనేది మనం తెలుసుకుందాం..
What Happens If You Eat Expired Food: మనం తీసుకోనే ఆహార పదార్థాలకు గడువు ఉంటుంది. దీని మనం ప్రతి రోజు కొనుగోలు చేసే ఆహార పదార్థాల ప్యాక్ మీద చూస్తూ ఉంటాము. దీని ఎక్స్‌పైరీ డేట్ అని కూడా పిలుస్తాము. ఈ గడువు ముగిసిన ఆహారం మన శరీరానికి ఎలా హాని చేస్తుందో తెలుసుకుందాం.
గడువు ముగిసిన ఆహారాలు బ్యాక్టీరియా పెరుగుదల, అచ్చు లేదా కెమికల్స్ మార్పుల చెందుతాయి. ముఖ్యంగా మనం రోజు తీసుకొనే పాల ఉత్పత్తులు చాలా త్వరగా పాడవుతాయి. అలాగే దీని వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
చాలా మంది ఫూడ్ పాయిజనింగ్ లేదా అజీర్ణం వంటి సమస్యల బారిన పడుతారు. దీనికి కారణం గడువు తీరిన ఆహార పదార్థాలు తీసుకోవడం. గడువు ముగిసిన ఆహారం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. పండ్లు, కూరగాయలు, బ్రెడ్ వంటివి గడవు ముగిసిన తర్వాత తీసుకోవడం వల్ల తీవ్రమైన సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.
చిప్స్, క్రిస్ప్స్, డ్రై స్నాక్స్ వంటి ప్యాక్ చేయబడిన వస్తువులు గడువు తేదీ తర్వాత తింటే తక్కువ ప్రమాదం ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే పాల ఉత్పత్తులు లేదా మాంసం వంటి ఆహారాలు ప్రమాదకరంగా మారవచ్చని చెబుతున్నారు.
గడువు ముదిసిన ఆహారం తీసుకోవడం వల్ల:
ఫుడ్ పాయిజనింగ్:
గడువు ముగిసిన ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల వికారం, వాంతులు, విరేచనాలు కలుగుతాయి. కాబట్టి గడువు ముగిసిన పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు.
Also Read Foods For Women: మహిళలు ఈ ఆహార పదార్థాలుఖచ్చితంగా తీసుకోవాలి!
ఫుడ్ పాయిజనింగ్ వల్ల రోజువారీ ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. చాలా వరకు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఆసుపత్రిలో చేరుతున్నారు.
అయితే ఫుడ్ పాయిజనింగ్ అనేది ఎలా గుర్తించవచ్చు:
బ్యాక్టీరియా, వైరస్లు. దాదాపు అన్ని ఆహారాలలో కనిపిస్తాయి. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు ఎక్కువ వినియోగం తర్వాత ఎక్కువ కాలం ఉండవు, చాలా త్వరగా పాడవుతాయి.
గడువు ముగిసిన ఆహారంలో పొషకాలు కోల్పోతాయి. గడువు తేది తర్వాత చెడు సువాసన వస్తుంది. ఈ గడువు ముగిసిన ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter