COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Fenugreek Seeds Can White Hair To Black In 5 Days: ఆధునిక జీవనశైలిలో తెల్ల జుట్టు సమస్యలు రావడం సర్వసాధరణంగా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మందిలో నల్ల జుట్టు తెల్లగా మారుతోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చాలా మందిలో టెన్షన్, ఒత్తిడి కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద గుణాలు కలిగిన హెయిర్ డైని వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే హెయిర్ డైలను వినియోగిస్తున్నారు. వీటికి వినియోగించడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


తెల్ల జుట్టును నల్లగా చేసే హోమ్‌ రెమెడీస్ ఇవే:
✺ తెల్ల జుట్టు సాధరణంగా నల్లగా మారడానికి..రాత్రిపూట నీళ్లతో నింపిన పాత్రలో మెంతి గింజలను నానబెట్టాలి. ఆ తర్వాత మిశ్రమంలా తయారు చేసి జుట్టుకు పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.


✺ మెంతి గింజలతో తయారు చేసిన నీరు కూడా చాలా ప్రభావంతంగా ఉంటుంది. ఈ గింజలను నీటిలో వేని..5 గంటల తర్వాత ఈ నీటిని మరిగించి చల్లారకా..జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


✺ మెంతి ఆకులతో తయారు చేసిన మిశ్రమంలో బెల్లం కలిపి బాగా మిక్స్‌ చేసి జుట్టుకు వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇలా క్రమంతప్పకుండా ఈ మిశ్రమాన్ని వినియోగించడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.


✺ మెంతి గింజలను గ్రైండ్ చేసి పౌడర్‌లా తయారు చేసి..అందులో నిమ్మరం మిక్స్‌ చేసి మిశ్రమంలా తయారు చేయాల్సి ఉంటుంది. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి బాగా మసాజ్‌ చేయాలి. ఇలా చేసిన తర్వాత 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే జుట్టు సులభంగా నల్లగా మారుతుంది.


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)