White Hair Prevention Home Remedies: జుట్టు నెరడం వల్ల ముఖం అందహీనంగా తయారవుతుంది. అయితే చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మందిలో ఈ జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవన శైలేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు  ఇంటి చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది జుట్టును సంరక్షించుకోవడానికి ఖరీదైన కండీషనర్లు వినియోగిస్తున్నారు. వీటిని అస్సలు వినియోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. వాటికి బదులుగా హెర్బల్ షాంపూని ఉపయోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే జుట్టు నల్లగా, దృఢంగా మారడానికి తప్పకుండా ఈ చిట్కాలను వినియోగించండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంట్లోనే హెర్బల్ షాంపూను ఇలా తయారు చేసుకోండి:
ఇంట్లో హెర్బల్ షాంపూ తయారు చేయడానికి.. 250 గ్రాముల కుంకుడు పొడి, 100 గ్రాముల మెంతి గింజలు, 1 గ్రాము వేప  ఆకుల పొడి, కొన్ని ఎండిన కరివేపాకులు, 100 గ్రాముల రీతా,  50 గ్రాముల ఉసిరి పొడి, వీటిని అన్నింటిని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని బాటిల్‌ పోసుకుని నిల్వ చేసుకుంటే హెర్బల్ షాంపూ రెడీ అయినట్లే..


హెర్బల్ షాంపూని ఇలా వాడండి:
ఇలా తయారుచేసిన హెర్బల్ షాంపూని అప్లై చేయడం కూడా సులభం. ఇందుకోసం ముందుగా 3 నుంచి 4 చెంచాల షాంపూ తీసుకుని నీటిలో కరిగించుకోవాలి. దీని తర్వాత జుట్టుకు అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత జుట్టును కడగాలి. ఈ షాంపూని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ జుట్టు నల్లగా మారుతుంది.


ఈ నూనె వాడడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి:
ఆలివ్ నూనె:

హెర్బల్ షాంపూతో పాటు, ఆలివ్ నూనె కూడా తెల్ల జుట్టును నల్లగా చేయడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని సులభంగా తగ్గించి జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తరచుగా జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆలివ్ నూనెను క్రమం తప్పకుండా జుట్టు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆవనూనెలో యాంటీ ఆక్సిడెంట్, సెలీనియం, కొవ్వు గుణాలు ఉన్నాయి. దీన్ని మసాజ్ చేయడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది.


Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..


Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook