White to Black Hair Home Remedies: ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో జుట్టు సులభంగా నెరసిపోతుంది. అంతేకాకుండా జుట్టు కూడా సులభంగా రాలుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది జుట్టు నల్లగా మారడానికి రసాయనాలతో కూడిన పలు ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్‌లో చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటికి బదులుగా పలు హోం రెమెడీస్‌ను వినియోగించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి రెమెడీస్‌ను ఇప్పుడు వాడాలో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెల్ల జుట్టును నల్లగా మారేందుకు అద్భుత చిట్కా:


రోజూ జుట్టుకు షాంపూ అప్లై చేయాలి:
జుట్టుకు షాంపూ అప్లై చేయడం వల్ల అవి మృదువుగా, పీచుగా మారుతుంది. ప్రతిరోజూ షాంపూ చేస్తే తీవ్ర జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జుట్టు రంగును అప్లై చేసేవారు ప్రతి రోజూ షాంపూ చేస్తే సులభంగా జుట్టు కలర్‌ పోయే అవకాశాలున్నాయి. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వారానికి 2 సార్లు జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్గానిక్‌ షాంపూలను మాత్రమే వినియోగించాలి.


మెహందీతో కూడా  సులభంగా జుట్టు నల్లగా మారుతుంది:


తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రసాయనాలతో కూడిన రంగులను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడతున్నారు. దీని కోసం మెహందీతో తయారు చేసిన మిశ్రమాన్ని వినియోగించాలి. అంతేకాకుండా ఇందులో హెన్నా, టీ లీఫ్ వాటర్, ఉసిరి పొడి, కాఫీ వాటర్ కలుపుకుని మిశ్రమంలా చేసి జుట్టు అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ మిశ్రమాన్ని వినియోగించాలి.


మెహందీ ఇలా శుభ్రం చేసుకోండి:


జుట్టుకు అప్లై చేసిన మెహందీని తప్పకుండా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.  అప్లై చేసిన 20-25 నిమిషాలు తర్వాత జుట్టు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడు చల్లని నీటితో జుట్టుకు అప్లై చేసి మెహందీ శుభ్రం చేస్తున్నారు. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే గోరువెచ్చని నీటితో దీనిని కడుక్కుకుంటే చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Delhi liq​uor Scam Case: ముగిసిన కవిత విచారణ, ఇవాళ మరోసారి ప్రశ్నించనున్న ఈడీ


Also Read: Ramadan 2023: రంజాన్ ఉపవాసాల్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎవరికి మినహాయింపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook