COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coconut Oil And Curry Leaves For White Hair: ప్రస్తుతం ఆధునిక జీవనశైలి కారణంగా, అనారోగ్యకరమైన ఆహారాల అలవాట్ల కారణంగా జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలు పిల్లల నుంచి పెద్ద వారిలో కూడా వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తరచుగా మార్కెట్‌లో లభించే పలు రకాల హెయిర్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌, హెయిర్‌ డైలను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అంతేకాకుండా వీటిని వినియోగించడం వల్ల చాలా మందిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు హోం రెమెడీస్‌ను వినియోగించాలి. వీటిని వినియోగించడం వల్ల శాశ్వతంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.


కరివేపాకు హోం రెమెడీ తెల్ల జుట్టు, జుట్టు రాలడం మాయం:
కరివేపాకుతో తయారు చేసిన హోం రెమెడీని వినియోగించడం వల్ల సులభంగా తెల్ల జుట్టు, జుట్టు రాలడం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా చుండ్రు సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు డ్రై హెయిర్‌ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ హెయిర్‌ డ్రైని ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు  


ఉసిరి, కరివేపాకు హెయిర్‌ మాస్క్:


కరివేపాకు మిశ్రమంలో ఉసిరి కలిపి మిక్స్‌ చేసిన మాస్క్‌కు అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత జుట్టును ఆరనివ్వాలి. ఇలా జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత జుట్టును శుభ్రం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడం సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. జుట్టును ఒత్తుగా తయారు చేసుకోవాలనుకునేవారు వారంలో రెండు సార్లు ఈ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది. 


కరివేపాకు, కొబ్బరి నూనె మాస్క్‌:
కొబ్బరి నూనెతో కరివేపాకు మిశ్రమాన్ని కలిపి 15 నిమిషాల పాటు పక్కన పెట్టి, ఆ తర్వాత జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టును శాశ్వతంగా నల్లగా చేసేందుకు సహాయపడుతుంది. జుట్టు రాలడం సమస్యలతో బాధపడుతున్నవారు రాత్రి పడుకునే ముందు ఈ మాస్క్‌ను అప్లై చేసి ఉదయం షాంపూను అప్లై చేసి శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.


Also Read: Tamil Nadu Blast: బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి