Fenugreek Leaves for White Hair: ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల చాలా మంది జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టుతో పాటు జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యలున్నవారికి ముఖం అందహీనంగా కనిపిస్తుంది. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత సులభంగా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడం చాలా మంచిది. లేకపోతే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. తెల్ల జుట్టు సమస్యలున్న చాలా మంది వివిధ రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం కూడా చాలా హానికరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఇంట్లో లభించే పలు వస్తువులను వినియోగించి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి చిట్కాలను వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మెంతి ఆకులు ప్రభావవంతంగా సహాయపడతాయని.. వాటిని వినియోగించడం వల్ల జుట్టుకు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ అందుతాయి. అంతేకాకుండా ఇందులో ఒమేగా-3, 6 కొవ్వు ఆమ్లాలు  జుట్టు రాలడాన్ని సులభంగా తగ్గించి దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలా మెంతులను వినియోగించడం వల్ల తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.


మెంతి ఆకులను జుట్టు ఎలా వినియోగించాలి..?


పచ్చి మెంతుల్లో ఉండే గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా చేయడమేకాకుండా జుట్టుతో పాటు చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.ఇందులో ఉండే విటమిన్ సి, ఒమేగా 3 & 6 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా చుండ్రు సమస్యలతో పాటు, జుట్టు రాలడాన్ని సులభంగా నియంత్రిస్తుంది. కాబట్టి జట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ మెంతులతో తయారు చేసి మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది. అయితే దానిని ఈ కింది విధంగా తయారు చేసుకోండి.


మెంతులను ఇలా వినియోగించండి:


  • ముందుగా పచ్చి మెంతి ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి.

  • ఇప్పుడు ఈ పేస్ట్‌లో హెన్నా పౌడర్ వేయాలి.

  • అంతేకాకుండా ఇండిగో పౌడర్, కొబ్బరి నూనె వేయండి.

  • ఇప్పుడు దానికి హెయిర్ కండీషనర్ వేసి పేస్ట్ లా చేసుకోండి.

  • రూట్ నుంచి ఈ మిశ్రమాన్ని బాగా అప్లై చేయండి.

  • 2 గంటల తర్వాత మీ జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి.


Also Read:  Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు


Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook