White Rice Disadvantages: రోజూ అన్నం తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!
White Rice Disadvantages: భారత్‌లో తెల్ల అన్న తినే వారి సంఖ్య అధికం. ఈ అన్నాన్ని రోజూ మూడు పూటలు తినే వారి సంఖ్య చాలా అధికంగా ఉన్నాయని నివేధికలు పేర్కొన్నాయి.
White Rice Disadvantages: భారత్‌లో తెల్ల అన్న తినే వారి సంఖ్య అధికం. ఈ అన్నాన్ని రోజూ మూడు పూటలు తినే వారి సంఖ్య చాలా అధికంగా ఉన్నాయని నివేధికలు పేర్కొన్నాయి. అయితే ఈ తెల్ల అన్నాన్ని రోజూ తింటే పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చాలా మందికి తెలియదు..! అయితే వైట్ రైస్‌ను ప్రతి రోజూ క్రమం తప్పకుండా తింటే.. బీపీ పెరగడమే కాకుండా మధుమేహం, స్థూలకాయం కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తెల్ల బియ్యం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో తెలుసుకుందాం..
హార్ట్ రిస్క్ పెరుగుతుంది:
బియ్యంలో శరీరానికి అవసరమైన పోషకాలుండవు. కాబట్టి ప్రతిరోజూ అన్నం తింటే పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన నివేదికలో అన్నాన్ని ఎక్కువగా తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తెలుపుతున్నారు.
మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య పెరగవచ్చు:
వైట్ రైస్ తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి నెలకు ఒకసారి మాత్రమే వైట్ రైస్ తినడం మంచిదని నిపుణులు పేర్కొన్నారు.
బరువును పెరగడం:
ఊబకాయంతో ఇబ్బంది పడేవారు వెంటనే వైట్ రైస్ తినడం మాకోవాలి. ఎందుకంటే వైట్ రైస్‌లో వివిధ రకాల పదార్థాలు ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Gain Tips: బరువు పెరగాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook